కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడండి " హైదరాబాద్ లో మోదీ పిలుపు
కుటుంబ పాలన చేసేవారు దేశద్రోహులు, తెలంగాణ కుటుంబ పాలనతో అవినీతిమయమయ్యింది అని ప్రధాని మోడీ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయన బేగంపేట విమానాశ్రయంలోనే బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర దాడి చేశారు.. ”తెలంగాణ పోరాటంలో వేలాది మంది త్యాగం చేశారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్ కోసం ఈ త్యాగాలు చేశారు. ఒక్క కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదు.” అన్నారు. తెలంగాణ […]
కుటుంబ పాలన చేసేవారు దేశద్రోహులు, తెలంగాణ కుటుంబ పాలనతో అవినీతిమయమయ్యింది అని ప్రధాని మోడీ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయన బేగంపేట విమానాశ్రయంలోనే బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర దాడి చేశారు.. ”తెలంగాణ పోరాటంలో వేలాది మంది త్యాగం చేశారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్ కోసం ఈ త్యాగాలు చేశారు. ఒక్క కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదు.” అన్నారు.
తెలంగాణ అభివృద్ది నిరోదకులు నాడే కాదు నేడు కూడా ఉన్నారని మోదీ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ద్వజమెత్తారు. తెలంగాణ సౌభాగ్యం కోసం ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలిచ్చారని మోదీ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేసిన మోదీ బీజేపీ పోరాటం అభివృద్ది కోసమే అని కుటుంబ పార్టీలకు ప్రజల అభివృద్ది పట్టదన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని ద్వజమెత్తిన మోడీ అయినా ప్రజల గుండెల్లో బీజేపీ స్థానాన్ని చెరపలేరని స్పష్టం చేశారు.