ప్లాన్ చంద్రబాబుది, డైరెక్షన్ పవన్‌ది, యాక్షన్ జనసేన కార్యకర్తలది
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసే కోనసీమలో అలజడి సృష్టిస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. ఈ రాష్ట్రానికి ఏకైక విలన్ చంద్రబాబు మాత్రమేనన్నారు. వైఎస్, ఎన్టీఆర్, కేసీఆర్, జగన్, వంగవీటి రంగాలకు కామన్ విలన్ చంద్రబాబేనన్నారు. చంద్రబాబు తన మచ్చలను కవర్ చేసుకోవడానికి పచ్చ మీడియాను పెట్టుకున్నారని, కొన్ని వ్యవస్థలను కూడా గుప్పెట్లో పెట్టుకున్నారని, అందుకే ఎవరికీ భయపడకుండా, బాధ్యత లేకుండా ఇలాంటి పనులు చేయిస్తున్నారని దాడిశెట్టి రాజా ఆరోపించారు. కేరళతో పోటీ పడే అందం కోనసీమకు […]
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసే కోనసీమలో అలజడి సృష్టిస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. ఈ రాష్ట్రానికి ఏకైక విలన్ చంద్రబాబు మాత్రమేనన్నారు. వైఎస్, ఎన్టీఆర్, కేసీఆర్, జగన్, వంగవీటి రంగాలకు కామన్ విలన్ చంద్రబాబేనన్నారు. చంద్రబాబు తన మచ్చలను కవర్ చేసుకోవడానికి పచ్చ మీడియాను పెట్టుకున్నారని, కొన్ని వ్యవస్థలను కూడా గుప్పెట్లో పెట్టుకున్నారని, అందుకే ఎవరికీ భయపడకుండా, బాధ్యత లేకుండా ఇలాంటి పనులు చేయిస్తున్నారని దాడిశెట్టి రాజా ఆరోపించారు.
కేరళతో పోటీ పడే అందం కోనసీమకు సొంతమని.. ప్రశాంతమైన ఈ ప్రాంత ప్రజలందరూ కలిసి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుకున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ కల్యాణ్‌కు.. అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయడం సరైన పద్దతి కాదన్నారు.
చంద్రబాబు ఎంతటి అడ్డమైన రాజకీయాలు చేయడానికైనా వెనుకాడరని.. మునుముందు ఇలాంటి రాజకీయాలను చాలా చూడాల్సి ఉంటుందన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం ఎక్కడా లేదని, పోలీసులు అప్రమత్తంగా లేకపోయి ఉంటే.. ప్రతిపక్షాలు చేసిన కుట్రలకు పరిస్థితి మరింత దిగజారిపోయి ఉండేదన్నారు. రాత్రి 9 గంటలకు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చామన్నారు. నిన్న బయటకు వచ్చిన వీడియోల్లో చాలా చోట్ల జై జనసేన అంటూ నినాదాలు వినిపించాయన్నారు. నిందితులెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
తునిలోనూ ఇదే తరహాలో దాడి చేశారని, అదే ప్లాన్ అమలాపురంలోనూ అమలు చేశారని ఆరోపించారు. కులాల మధ్య విభజన తెస్తే గానీ.. రాజకీయాలు చేయలేమన్న భావనకు చంద్రబాబు వచ్చారన్నారు. చంద్రబాబు ప్లాన్ చేస్తే.. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జనసేన కార్యకర్తలు అమలాపురంలో విధ్వంసం సృష్టించారని రాజా ఆరోపించారు.
ALSO READ: భావి ప్రధాని కేటీఆర్.. దావోస్ లో ఇదే హైలైట్