కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కపిల్ సిబల్ " ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు నామినేషన్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ సమక్షంలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసినట్లు బుధవారం ఆయన ప్రకటించారు. SP మద్దతుతో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సిబల్ మాట్లాడుతూ తాను మే 16 వ తేదీనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు.. ”నేను స్వతంత్ర అభ్యర్థిగా […]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ సమక్షంలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసినట్లు బుధవారం ఆయన ప్రకటించారు.
SP మద్దతుతో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సిబల్ మాట్లాడుతూ తాను మే 16 వ తేదీనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు..
”నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. నాకు మద్దతుగా నిలిచిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు. ఇప్పుడే కాకుండా చాలా సంవత్సరాలుగా ఆజం ఖాన్ నాకు అందించిన మద్దతుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని సిబల్ అన్నారు.
కాంగ్రెస్ నాయకుడిగా ఉండటం కన్నా స్వతంత్రంగా ఉండటం అవసరమని భావిస్తున్నానని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ఆయన న్నారు.
ఈ పరిణామంపై అఖిలేష్ మాట్లాడుతూ, “ఈ రోజు కపిల్ సిబల్ నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. కపిల్ సిబల్ సీనియర్ న్యాయవాది. పార్లమెంట్‌లో తన అభిప్రాయాలను చక్కగా చెప్తారు.” అని అన్నారు.