కరోనా సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణం.. గుండె పనితీరును నాశనం చేస్తోంది.. ఒక అధ్యయనంలో వెల్లడి

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కోట్లాది మంది అత్యవసర చికిత్స అవసరమై ఆసుపత్రుల్లో ఉండిపోయారు. ఐసీయూల్లో వెంటిలేటర్లపై ఉండి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎన్నో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా చికిత్స సమయంలో వెంటిలేటర్లపై ఉండి ప్రాణాలను రక్షించుకున్న చాలా మంది ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు దారుణంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, […]

Advertisement
Update:2022-05-25 04:41 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కోట్లాది మంది అత్యవసర చికిత్స అవసరమై ఆసుపత్రుల్లో ఉండిపోయారు. ఐసీయూల్లో వెంటిలేటర్లపై ఉండి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎన్నో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా చికిత్స సమయంలో వెంటిలేటర్లపై ఉండి ప్రాణాలను రక్షించుకున్న చాలా మంది ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు దారుణంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, ఎన్‌హెచ్ఎస్ గోల్డెన్ జూబ్లీ సైంటిస్టులు నిర్వహించిన ఒక పరిశోధనలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి అయ్యాయి. కరోనా వైరస్ సోకిన వారి ఊపిరితిత్తులు, గుండె పనితీరు చాలా దారుణంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా గుండెకు రక్తం సరఫరా చేసే ఊపిరితిత్తుల కుడివైపు భాగంపై కరోనా తీవ్రంగా ప్రభావం చూపించినట్లు సైంటిస్టులు చెప్పారు. ఐసీయూలో వెంటిలేటర్లపై కరోనా కోసం చికిత్స తీసుకున్న 121 మందిపై ఈ పరిశోధన నిర్వహించించారు. తాము నిర్వహించిన పరిశీనలల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరి గుండె కుడిపైపు దెబ్బతిన్నదని.. దీని కారణంగా మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వారు చెప్పారు.

కరోనా చికిత్స పొందిన అనంతరం ఊపిరితిత్తులు చాలా బలహీనంగా మారిపోయాయని.. అందువల్ల అవి రక్తాన్ని సరిగా స్వీకరించలేకపోతున్నాయని ఈ పరిశోదనలు గుర్తించారు. గుండె మాత్రం రక్తాన్ని పంపింగ్ చేసేందుకు చాలా ప్రయత్నిస్తున్నదని… కానీ అంతకు ముందు కంటే దాని పనితీరు చాలా తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనను కార్డియోథొరాసిక్ ఎనస్థీషియా, ఇంటెన్సీవ్ కేర్‌కు చెందిన ఫిలిప్ మెక్‌కాల్ అనే వైద్యుడు నిర్వహించారు. కరోనా చాలా మందిలో తగ్గిపోయినా.. ఆ తర్వాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని ఆయన చెప్పారు. అయితే ఇప్పటికీ మెరుగైన చికిత్సను తీసుకొని వీటిని అధిగమించవచ్చని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News