నా డబ్బుతో నీ బిడ్డ పెళ్లి చేశావ్- మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని.. అధికారంలోకి రాగానే జైలుకు పంపుతామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ అని, పెద్ద బ్లాక్‌మెయిలర్ అని మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. ఇద్దరం టీడీపీలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి తనను అనేక రకాలుగా వేధించారని, బ్లాక్మెయిల్ చేశారని మల్లారెడ్డి చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు అమాయకుడైన లోకేష్‌ను పట్టుకుని, చంద్రబాబును నమ్మించి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తెచ్చుకున్నారని.. రేవంత్ రెడ్డి […]
మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని.. అధికారంలోకి రాగానే జైలుకు పంపుతామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ అని, పెద్ద బ్లాక్‌మెయిలర్ అని మల్లారెడ్డి ఫైర్ అయ్యారు.
ఇద్దరం టీడీపీలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి తనను అనేక రకాలుగా వేధించారని, బ్లాక్మెయిల్ చేశారని మల్లారెడ్డి చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు అమాయకుడైన లోకేష్‌ను పట్టుకుని, చంద్రబాబును నమ్మించి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తెచ్చుకున్నారని.. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందన్నారు.
తాను టీడీపీలోనే ఉన్నా సరే డబ్బులు ఇస్తావా లేక కాలేజీలు మూయించాలా అంటూ రేవంత్ బ్లాక్మెయిల్ చేశారన్నారు. చివరకు ఎంపీగా తాను గెలిచినా రేవంత్ రెడ్డి వేధించారని, చంద్రబాబుకు చెప్పినా ఫలితం లేకపోవడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చేశామన్నారు.
హైదరాబాద్‌లోనే అనేక మందిని బెదిరించి రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదించారని ఆరోపించారు. ఒక్క వ్యాపారం చేయకుండా, ఒక్క కాంట్రాక్టు పని చేయకుండా కేవలం బ్లాక్మెయిల్ ద్వారానే రేవంత్ రెడ్డి ఇన్ని డబ్బులు సంపాదించారని, ఆ డబ్బుతోనే పీసీసీ అధ్యక్ష పదవిని కూడా కొనుక్కున్నారని మల్లా రెడ్డి ఆరోపించారు.
యాదగిరి గుట్ట దగ్గర ప్రమాణం చేసేందుకు సిద్ధమని.. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి ఎవరి డబ్బుతో చేశారో చెప్పాలన్నారు. తాను ఇచ్చిన డబ్బుతోనే బిడ్డకు రేవంత్ రెడ్డి పెళ్లి చేశారని మల్లారెడ్డి చెప్పారు. అలాంటి చరిత్ర ఉన్న రేవంత్ రెడ్డి తనను జైలుకు పంపిస్తానని మాట్లాడుతారా అని మండిపడ్డారు.
టీడీపీలో ఉన్నప్పుడు తాను స్వయంగా చూశానని.. ఎక్కడైనా పార్టీ మీటింగ్ ఉందంటే ముందుగానే ఓ వంద మంది మనుషులను పంపించి వేదికకు ముందు కూర్చోబెడుతారని.. రేవంత్ రెడ్డి రాగానే వారంతా ఒక్కసారిగా రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ అరుస్తారని.. అది చూసి అందరూ రేవంత్ రెడ్డికి ఇంత క్రేజ్ ఉందా అని అనుకోవాలన్న ఉద్దేశంతోనే అలా చేసేవారన్నారు.
ALSO RAED: ఆ సిద్ధాంతాలను నమ్మితే ప్రమాదం- ఉండవల్లి