అనంతబాబుకి ఆ మర్యాదలేంటి..? " పవన్ కల్యాణ్
మాజీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకి పోలీసులు ఇచ్చిన గౌరవ మర్యాదలు తనకి ఆశ్చర్యాన్ని కలిగించాయని అన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేశానని అనంతబాబు ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన పట్ల పోలీసులు అంత మర్యాదగా ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సామాన్యుల పట్ల కూడా పోలీసులు ఇలాగే సహృదయతతో ఉంటారా అని అడిగారు. పోలీసులపై ఆధిపత్యం చలాయిస్తున్న రాజకీయ బాసుల వల్లే అనంతబాబు హత్య చేసినా ఆయనకు గౌరవ మర్యాదలు […]
మాజీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకి పోలీసులు ఇచ్చిన గౌరవ మర్యాదలు తనకి ఆశ్చర్యాన్ని కలిగించాయని అన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేశానని అనంతబాబు ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన పట్ల పోలీసులు అంత మర్యాదగా ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సామాన్యుల పట్ల కూడా పోలీసులు ఇలాగే సహృదయతతో ఉంటారా అని అడిగారు. పోలీసులపై ఆధిపత్యం చలాయిస్తున్న రాజకీయ బాసుల వల్లే అనంతబాబు హత్య చేసినా ఆయనకు గౌరవ మర్యాదలు దక్కాయని విమర్శించారు పవన్ కల్యాణ్. నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని మార్చేశారని మండిపడ్డారు.
కేవలం ప్రతిపక్ష పార్టీల నేతల విషయంలో మాత్రమే కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు పవన్ కల్యాణ్. అధికార పార్టీ నేతలు తప్పు చేస్తే ఎలాంటి మర్యాదలు జరుగుతాయో అనంతబాబు విషయంలో మరోసారి రుజువైందని చెప్పారు.
ఏపీలో దాడులు చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా ఏం జరగదు, ఎవరేం చేయరనే ధైర్యం నేరస్థులకు కలిగిందని అన్నారు పవన్ కల్యాణ్. పాలకుల వైఖరే దీనికి ప్రధాన కారణం అని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను వైసీపీ గాలికొదిలేసిందని, వారికి చిత్తశుద్ధి లేదని అన్నారు పవన్. వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. హత్య చేశానని ఒప్పుకున్న అనంతబాబుని పార్టీ నుంచి బయటకు పంపించాలని, శాసన మండలి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.