ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్స్ కు వాన గండం గుజరాత్ తో రాజస్థాన్ ఫైట్
టాటా-ఐపీఎల్ 15వ సీజన్ తొలిదశ 70 మ్యాచ్ ల లీగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక సంఘానికి అసలుసిసలు పరీక్ష ఇప్పుడే మొదలయ్యింది. ప్లే-ఆఫ్ దశలోని మొదటి రెండుమ్యాచ్ లకు వేదికగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ ను ఎంపిక చేయడంతోనే వానటెన్షన్ ప్రారంభమయ్యింది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో ఒకటైన ఈడెన్ గార్డెన్స్ ను క్వాలిఫైయర్స్-1, ఎలిమనేటర్ రౌండ్ మ్యాచ్ లకు వేదికగా ఎంపిక చేశారు.. పెనుగాలుల విధ్వంసం… లీగ్ టేబుల్ టాపర్స్ గుజరాత్ […]
టాటా-ఐపీఎల్ 15వ సీజన్ తొలిదశ 70 మ్యాచ్ ల లీగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక సంఘానికి అసలుసిసలు పరీక్ష ఇప్పుడే మొదలయ్యింది.
ప్లే-ఆఫ్ దశలోని మొదటి రెండుమ్యాచ్ లకు వేదికగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ ను ఎంపిక చేయడంతోనే వానటెన్షన్ ప్రారంభమయ్యింది.
దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో ఒకటైన ఈడెన్ గార్డెన్స్ ను క్వాలిఫైయర్స్-1, ఎలిమనేటర్ రౌండ్ మ్యాచ్ లకు వేదికగా ఎంపిక చేశారు..
పెనుగాలుల విధ్వంసం…
లీగ్ టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య తొలి క్వాలిఫైయర్ సమరం ప్రారంభానికి రెండురోజుల ముందే…కోల్ కతా నగరాన్ని, ఈడెన్ గార్డెన్స్ ను పెనుగాలులతో కూడిన వర్షం గడగడలాడించింది.
గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, భారీవర్షానికి ఈడెన్ గార్డెన్స్ లోని మీడియా బాక్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే..గ్రౌండ్ లోని అవుట్ ఫీల్డ్ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచిన కారణంగా మ్యాచ్ ను సజావుగా నిర్వహించగలమన్న ధీమాను స్టేడియం వర్గాలు వ్యక్తం చేశాయి.
రెండుమ్యాచ్ లకూ వానముప్పు..
మే 24న జరిగే తొలి క్వాలిఫైయర్ ( గుజరాత్- రాజస్థాన్ ), 25న జరిగే ఎలిమనేటర్ రౌండ్ ( లక్నో- బెంగళూరు ) మ్యాచ్ లకు వానముప్పు ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
మరోవైపు…మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయించాలన్న విషయమై పాలకమండలి ఓ అవగాహనకు వచ్చింది.
ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే రెండుమ్యాచ్ ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ లను ఎలాగైనా నిర్వహించాలన్న పట్టుదలతో స్టేడియం సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
సూపర్ ఓవర్ లేదా డక్ వర్త్ లూయిస్…
ప్లే-ఆఫ్ రౌండ్ మ్యాచ్ లు ..ఒకవేళ వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించనున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. అంతేకాదు.. ఒకవేళ ఒక జట్టు బ్యాటింగ్ ముగిసిన తర్వాత మ్యాచ్ ఆగిపోతే.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయిస్తారు.
లేదంటే వర్షం తో నష్టపోయిన సమయాన్ని బట్టి ఓవర్లు కుదించి మ్యాచ్ ఆడించే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత క్వాలిఫైయర్-2, ఫైనల్ రెండు మ్యాచులు కూడా అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. క్వాలిఫైయర్-2 విషయంలో కూడా అవే రూల్స్ పాటిస్తారు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్ డే ఉంది.
అంటే మ్యాచ్ గనుకు ఏదైనా కారణం వల్ల మధ్యలో ఆగిపోతే.. ఆగిపోయిన సందర్భం నుంచి మే 30న మ్యాచ్ జరుగుతుంది. అంతకుముందు రోజు ఒక్క బంతి పడినా సరే.. ఆ తర్వాతి రోజు అక్కడి నుంచే మ్యాచ్ ను కొనసాగించనున్నారు.
వరుణదేవుడు కరుణిస్తేనే ప్లే-ఆఫ్ రౌండ్ మొదటి రెండుమ్యాచ్ లు సజావుగా జరిగే అవకాశం ఉంది.