ఐపీఎల్ యంగ్ గన్ సొంతింటికల సాకారం! తొలిసీజన్లోనే అదరగొట్టిన తెలుగుతేజం

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్..గత 14 సీజన్లుగా ప్రతిభావంతులైన ఎందరో యువక్రికెటర్ల జీవితాలలో వెలుగులు నింపుతోంది. నిరుపేద దిగువమధ్యతరగతి కుటుంబాల నేపథ్యం నుంచి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన పలువురు యువఆటగాళ్లు తమ కలల్ని మాత్రమే కాదు..తమ కన్నవారి కలల్ని సైతం సాకారం చేస్తూ క్రికెటర్లుగా తమ జీవితాలను సార్థకం చేసుకొంటున్నారు. ప్రస్తుత టాటా ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ ద్వారా జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన నవతరం ఆటగాళ్లలో హైదరాబాద్ కమ్ ముంబై ఇండియన్స్ యంగ్ గన్ తిలక్ వర్మ గురించి ముందుగా చెప్పుకోవాలి. మధ్యతరగతి కష్ట్లాలు హైదరాబాద్ లోని ఓ దిగువమధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన 19 సంవత్సరాల తిలక్ వర్మ…కోటి 90 లక్షల రూపాయల వేలం ధరకు ముంబై ఇండియన్స్ జట్టు ద్వారా ఐపీఎల్ అరంగేట్రాన్ని అత్యంత విజయవంతంగా ముగించగలిగాడు. అమ్మానాన్న ఓ తమ్ముడు సభ్యులుగా ఉన్న తమ కుటుంబానికి తండ్రి తెచ్చే చాలీచాలని జీతమే ఆధారమని..తమకు సొంతిల్లు కూడా లేదని గతంలో వాపోయిన తిలక్ వర్మ..ప్రస్తుత సీజన్ ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబానికి అండగా నిలిచాడు. ముందుగా..తమ కుటుంబానికి సొంతిల్లు ఏర్పాటు చేస్తానని, తమ్ముడి చదువు బాధ్యత కూడా తనదేనని ప్రకటించాడు. క్రికెటర్  గా తొలిరోజుల్లో ఆర్థికంగా అష్టకష్టాలు ఎదుర్కొన్న తిలక్ వర్మ..హైదరాబాద్ జట్టుకు ఆడటం ద్వారా లభించే మ్యాచ్ ఫీజులతో నిలదొక్కుకోగలిగాడు. తొలిసీజన్లోనే సూపర్ హిట్ పదిజట్ల ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ ద్వారా తన సత్తాను చాటుకొన్న తిలక్ వర్మ…ప్రస్తుతసీజన్లో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన ఆటగాడిగా, టాప్ స్కోరర్ గా నిలిచాడు. అరంగేట్రం సీజన్‌లో ఓ అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నిలిచిన బ్యాటర్లలో.. తొలి స్థానంలో షాన్‌ మార్ష్‌ 616 పరుగులు (2008 సీజన్‌లో) నిలిచాడు. దేవదత్‌ పడిక్కల్‌ 473 పరుగులు(2020 సీజన్‌లో) రెండో స్థానం, శ్రేయాస్‌ అయ్యర్‌ 439 పరుగులు(2015 సీజన్‌లో) మూడో స్థానంలో ఉండగా.. తిలక్‌ వర్మ 397 పరుగులు(2022 సీజన్‌లో) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక చివరగా ఐదో స్థానంలో రాహుల్‌ త్రిపాఠి 2017లో 391 పరుగులు సాధించాడు. మొత్తం 14 లీగ్ మ్యాచ్ లూ ఆడిన తిలక్ వర్మ రెండు అర్థశతకాలతో సహా మొత్తం 397 పరుగులు సాధించాడు. అరంగేట్రం సీజన్లోనే అత్యధిక పరుగులు సాధించిన పిన్నవయస్కుడైన ఆటగాడిగా, అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రికార్డుల్లో చేరాడు. తిలక్ వర్మ 29 బౌండ్రీలు, 16 సిక్సర్లతో 397 […]

Advertisement
Update:2022-05-23 06:00 IST

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్..గత 14 సీజన్లుగా ప్రతిభావంతులైన ఎందరో యువక్రికెటర్ల జీవితాలలో వెలుగులు నింపుతోంది.

నిరుపేద

దిగువమధ్యతరగతి కుటుంబాల నేపథ్యం నుంచి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన పలువురు యువఆటగాళ్లు తమ కలల్ని మాత్రమే కాదు..తమ కన్నవారి కలల్ని సైతం సాకారం చేస్తూ క్రికెటర్లుగా తమ జీవితాలను సార్థకం చేసుకొంటున్నారు.

ప్రస్తుత టాటా

ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ ద్వారా జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన నవతరం ఆటగాళ్లలో హైదరాబాద్ కమ్ ముంబై ఇండియన్స్ యంగ్ గన్ తిలక్ వర్మ గురించి ముందుగా చెప్పుకోవాలి.

మధ్యతరగతి కష్ట్లాలు

హైదరాబాద్ లోని ఓ దిగువమధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన 19 సంవత్సరాల తిలక్ వర్మ…కోటి 90 లక్షల రూపాయల వేలం ధరకు ముంబై ఇండియన్స్ జట్టు ద్వారా ఐపీఎల్ అరంగేట్రాన్ని అత్యంత విజయవంతంగా ముగించగలిగాడు.

అమ్మానాన్న

ఓ తమ్ముడు సభ్యులుగా ఉన్న తమ కుటుంబానికి తండ్రి తెచ్చే చాలీచాలని జీతమే ఆధారమని..తమకు సొంతిల్లు కూడా లేదని గతంలో వాపోయిన తిలక్ వర్మ..ప్రస్తుత సీజన్ ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబానికి అండగా నిలిచాడు.

ముందుగా..తమ కుటుంబానికి సొంతిల్లు ఏర్పాటు చేస్తానని, తమ్ముడి చదువు బాధ్యత కూడా తనదేనని ప్రకటించాడు. క్రికెటర్ గా తొలిరోజుల్లో ఆర్థికంగా అష్టకష్టాలు ఎదుర్కొన్న తిలక్ వర్మ..హైదరాబాద్ జట్టుకు ఆడటం ద్వారా లభించే మ్యాచ్ ఫీజులతో నిలదొక్కుకోగలిగాడు.

తొలిసీజన్లోనే సూపర్ హిట్

పదిజట్ల ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ ద్వారా తన సత్తాను చాటుకొన్న తిలక్ వర్మ…ప్రస్తుతసీజన్లో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన ఆటగాడిగా, టాప్ స్కోరర్ గా నిలిచాడు.

అరంగేట్రం సీజన్‌లో ఓ అన్‌క్యాప్‌డ్‌

ప్లేయర్‌గా అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నిలిచిన బ్యాటర్లలో.. తొలి స్థానంలో షాన్‌ మార్ష్‌ 616 పరుగులు (2008 సీజన్‌లో) నిలిచాడు. దేవదత్‌ పడిక్కల్‌ 473 పరుగులు(2020 సీజన్‌లో) రెండో స్థానం, శ్రేయాస్‌ అయ్యర్‌ 439 పరుగులు(2015 సీజన్‌లో) మూడో స్థానంలో ఉండగా.. తిలక్‌ వర్మ 397 పరుగులు(2022 సీజన్‌లో) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక చివరగా ఐదో స్థానంలో రాహుల్‌ త్రిపాఠి 2017లో 391 పరుగులు సాధించాడు.

మొత్తం 14 లీగ్ మ్యాచ్ లూ ఆడిన తిలక్ వర్మ రెండు అర్థశతకాలతో సహా మొత్తం 397 పరుగులు సాధించాడు. అరంగేట్రం సీజన్లోనే అత్యధిక పరుగులు సాధించిన పిన్నవయస్కుడైన ఆటగాడిగా, అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రికార్డుల్లో చేరాడు. తిలక్ వర్మ 29 బౌండ్రీలు, 16 సిక్సర్లతో 397 పరుగులు నమోదు చేశాడు. మిడిలార్డర్ లో అత్యంత నమ్మదగిన, కుదురైన బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

రిషబ్ రికార్డు తెరమరుగు….

అంతేకాదు..ఓ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టీనేజర్‌గానూ తిలక్‌ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 2017 సీజన్‌లో రిషబ్‌ పంత్‌ 14 మ్యాచ్‌ల్లో 366 పరుగులు సాధించడం ద్వారా రికార్డు నెలకొల్పాడు. అయితే ..ప్రస్తుత సీజన్లో తిలక్‌ వర్మ 12 మ్యాచ్‌ల్లోనే పంత్‌ రికార్డును అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు . లిఖించుకున్నాడు. ఈ క్రమంలో తిలక్‌ వర్మ.. పృథ్వీ షా (16 మ్యాచ్‌ల్లో 353 పరుగులు), సంజూ శాంసన్‌ (13 మ్యాచ్‌ల్లో 339) లను కూడా అధిగమించాడు.

తిలక్ కు దిగ్గజాల ప్రశంసలు…

ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ పోరు లీగ్ దశలోనే ముగిసినా..తిలక్ వర్మ మాత్రం చక్కటి గుర్తింపు తెచ్చుకొన్నాడు. తిలక్ వర్మ ఆటతీరు, పరిణతిని చూసి…భారత క్రికెట్ దిగ్గజం, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ ముచ్చట పడిపోయారు. భారతజట్టులో ఉండదగిన ఆటగాడు తిలక్ అంటూ కొనియాడారు.

మరోవైపు…ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తిలక్ ఆటతీరుకు హ్యాట్సాఫ్ చెప్పాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ రాణించే సత్తా తిలక్ వర్మకు ఉందని ప్రశంసించాడు.

ఐపీఎల్-2022 మెగా వేలంలో తిలక్ వర్మ వేలం కనీసధర 20 లక్షల రూపాయలు కాగా..ముంబై ఫ్రాంచైజీ మాత్రం కోటీ 90 లక్షల రూపాయల ధరకు సొంతం చేసుకోగలిగింది.

తొలిసీజన్లోనే అంచనాలకు మించి రాణించిన తిలక్ వర్మ రానున్న సీజన్లలో ఇదేజోరు కొనసాగించగలిగితే కోట్ల వర్షమే అనడంలో సందేహం లేదు.

ఇదిలా ఉంటే, సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ వర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. సీఎస్‌కే నిర్ధేశించిన 98 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి మరో 31 బంతులు మిగిలుండగానే ఛేదించింది. తిలక్‌ వర్మ ఒక్కడే నిలకడగా రాణించి ముంబై ఇండియన్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.

Tags:    
Advertisement

Similar News