ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ.. లంచం అడిగిన డాక్టర్ అక్కడికక్కడే సస్పెండ్
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సోమవారం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఈ ఏరియా ఆసుపత్రికి వచ్చిన హరీష్ రావు అక్కడి రోగులను అడిగి సౌకర్యాలు, సిబ్బంది వ్యవహారం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని ఓ వైద్యుడి అవినీతి బాగోతం గురించి పిర్యాదు అందింది. డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి మెడికల్ ఫిట్‌నెస్ టెస్టు సర్టిఫికెట్ కోసం డాక్టర్ లంచం అడుగుతున్నాడని కొంత […]
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సోమవారం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఈ ఏరియా ఆసుపత్రికి వచ్చిన హరీష్ రావు అక్కడి రోగులను అడిగి సౌకర్యాలు, సిబ్బంది వ్యవహారం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని ఓ వైద్యుడి అవినీతి బాగోతం గురించి పిర్యాదు అందింది. డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి మెడికల్ ఫిట్‌నెస్ టెస్టు సర్టిఫికెట్ కోసం డాక్టర్ లంచం అడుగుతున్నాడని కొంత మంది పిర్యాదు చేశారు.
డాక్టర్ ఛాంబర్‌కు వెళ్లిన హరీష్ రావు అక్కడికక్కడే వైద్యుడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవినీతి జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని, ఆసుపత్రి సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఆసుపత్రిలోని ప్రతీ వార్డుకు తిరిగి రోగులను పరామర్శించారు. ఓపీ వద్ద వెయిట్ చేస్తున్న రోగులతో కూడా మాట్లాడారు.
ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఔషధాల గురించి ఆరా తీశారు. కొరతగా ఉన్న వాటిని వెంటనే తెప్పించాలని, ఎలాంటి తాత్సరం చేయవద్దని ఆయన సిబ్బందికి సూచించారు.