పోసానిని ముందు మాకే అప్పగించండి.. నరసరావుపేట పోలీసులు
నటుడు పోసాని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.;
Advertisement
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై పీటీ వారెంట్ ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేటకు పోలీసులు తరలిస్తున్నారు. స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్‌లో 153A,504,67 ఐటీ యాక్ట్ కింద పోసానిపై కేసు నమోదు చేశారు.
ఇవాళ మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కోరే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 15 కేసులు నమోదయ్యాయి. అందులో 3 జిల్లాలకు చెందిన పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెట్లు సబ్‌మిట్ చేశారు. ఈ మేరకు తాము మేం కోర్టు అనుమతి తీసుకున్నామని ముందుగా మాకే పోసానిని అప్పగించాలంటూ అని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Advertisement