తెలంగాణ శాసనసభ, మండలి ప్రోరోగ్‌

శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నిర్ణయం;

Advertisement
Update:2025-03-02 22:22 IST

తెలంగాణ శాసనసభ, శాసనమండలిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రోరోగ్‌ చేశారు. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్‌ జారీ అయింది. డిసెంబర్‌లో ప్రారంభమైన సమావేశాలను ప్రోరోగ్‌ చేయకుండానే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి సంతాపం, ఎస్సీ వర్గీకరణ, కులగణన నివేదికలపై ప్రకటన కోసం కొనసాగించారు. తాజాగా ఉభయసభను ప్రోరోగ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. దీంతో శాసనసభ, మండలిని ప్రోరోగ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించాల్సి ఉంటుంది. అసెంబ్లీ, మండలిని సమావేశపరిచడానికి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. 

Tags:    
Advertisement

Similar News