37వ సారి ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్

సీఎం రేవంత్‌రెడ్డి 37వ సారి ఢిల్లీకి చేరుకున్నారు.;

Advertisement
Update:2025-03-03 13:08 IST

సీఎం రేవంత్‌రెడ్డి 37వ సారి ఢిల్లీకి చేరుకున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉన్నారు. మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవుతారు. కృష్ణా నీటి కేటాయింపులు, సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ, సీతారామతో సహా తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. అలాగే కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News