ఏపీలో 'ఫ్యామిలీ డాక్టర్' కాన్సెప్ట్.. అందరికీ సరైన వైద్యం అవసరం : దావోస్‌లో సీఎం వైఎస్ జగన్

ఏపీలో ప్రతీ కుటుంబానికి సరైన వైద్యం అందించాలనే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని.. ఫ్యామిలీ డాక్టర్ల మాదిరిగా వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అనే అంశంపై సోమవారం ఆయన మాట్లాడారు. ఏపీలో కోవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యచరణ అమలు చేశామని ఆయన చెప్పారు. అందుకే దేశంలోనే […]

Advertisement
Update:2022-05-23 09:30 IST

ఏపీలో ప్రతీ కుటుంబానికి సరైన వైద్యం అందించాలనే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని.. ఫ్యామిలీ డాక్టర్ల మాదిరిగా వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అనే అంశంపై సోమవారం ఆయన మాట్లాడారు. ఏపీలో కోవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యచరణ అమలు చేశామని ఆయన చెప్పారు. అందుకే దేశంలోనే అత్యల్పంగా 0.6 మరణాల రేటు నమోదైందని ఆయన అన్నారు. ఇది జాతీయ స్థాయి కన్నా చాలా తక్కువని వివరించారు.

ఏపీలో ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేశామని, 44 ఇళ్లను ఒక యూనిట్‌గా తీసుకొని కోవిడ్ సర్వే చేశామని ఆయన చెప్పారు. వలంటీర్లతో పాటు 42 వేల మంది ఆశా వర్కర్లు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారని అన్నారు. ఇంటింటి సర్వే చేసి కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని గుర్తించడం వల్లే వారికి సరైన సమయంలో మెడిసిన్స్, పౌష్టికాహారం అందించి త్వరగా కోలుకునేలా చేశామన్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, రోగాలు వస్తే సరైన సమయంలో వైద్యం అందించడం అనే రెండు ముఖ్య అంశాలను ప్రాతిపదికగా తీసుకొని హెల్త్ కేర్ సిస్టమ్ సిద్దం చేశామన్నారు. రాష్ట్రంలో 2 వేల జనాభా కలిగిన గ్రామాల్లో విలేజ్ క్లీనిక్‌లను ఏర్పాటు చేశామని, 13 వేల జనాభా కలిగిన మండలాలను ఒక యూనిట్‌గా రెండు పీహెచ్‌సీలను నెలకొల్పామన్నారు. ఈ ఆరోగ్యకేంద్రాల్లో నలుగురు డాక్టర్లు ఉంటారని.. వీటికి అనుబంధంగా ‘104’ అంబులెన్సులు కూడా ఉంటాయని చెప్పారు. పీహెచ్‌సీల్లో ఉన్న డాక్టర్లకు కొన్ని గ్రామాల బాధ్యతలు అప్పగించామని.. వాళ్లు రోజు విడిచి రోజు ఈ అంబులెన్సుల ద్వారా గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో టచ్‌లో ఉంటారని ఆయన చెప్పారు.

ప్రతీ రోజు డాక్టర్లు గ్రామాల్లో తిరగడం ద్వారా వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది, వాళ్లను పేర్లు పెట్టి పిలిచే అంత దగ్గర అవుతారు.. వాళ్లు ఫ్యామిలీ డాక్టర్ల లాగా మారతారని జగన్ వివరించారు. గ్రామంలోని ప్రతీఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డాక్టర్ల వద్ద ఉంటుంది కాబట్టి భవిష్యత్‌లో ఏవైనా రోగాలు వచ్చినా సులభంగా చికిత్స చేసే అవకాశం ఉంటుందన్నారు.

ఏపీలో భవిష్యత్ అవసరాల కోసం వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. తాను బాధ్యతలు చేపట్టక మునుపు 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు కొత్తగా 16 మెడికల్ కాలేజీలను మంజూరు చేశామని అన్నారు. దీంతో పాటు ఆరోగ్యశ్రీ తీరు తెన్నులను కూడా వైఎస్ జగన్ వివరించారు. దీని ద్వారా 2,446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గిందని వైఎస్ జగన్ వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News