1200 పెండింగ్ పీహెచ్‌డీలను రద్దు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకున్నది. పీహెచ్‌డీ కోసం నమోదు చేసుకున్నా.. నిర్ణీత సమయంలోపు థీసీస్ సమర్పించని వందలాది మంది విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డి. రవీందర్ శనివారం ప్రకటించారు. థీసీస్‌లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 1,200 మంది విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేశామని, కేవలం 1,280 మంది విద్యార్థులు మాత్రమే నిర్ణీత సమయంలోపు తమ థీసీస్‌లు సబ్మిట్ చేశారని వీసీ చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీల్లో పలు […]
ఉస్మానియా యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకున్నది. పీహెచ్‌డీ కోసం నమోదు చేసుకున్నా.. నిర్ణీత సమయంలోపు థీసీస్ సమర్పించని వందలాది మంది విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డి. రవీందర్ శనివారం ప్రకటించారు. థీసీస్‌లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 1,200 మంది విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేశామని, కేవలం 1,280 మంది విద్యార్థులు మాత్రమే నిర్ణీత సమయంలోపు తమ థీసీస్‌లు సబ్మిట్ చేశారని వీసీ చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీల్లో పలు సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేయడానికి 2009 నుంచి 2017 మధ్య చాలా మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. వీళ్లు తమ థీసీస్‌లు సమర్పించడానికి 13 ఏప్రిల్ 2022 చివరి తేదీ కాగా.. కేవలం 1,280 మంది విద్యార్థులు మాత్రమే సబ్మిట్ చేసినట్లు వీసీ తెలిపారు. దీంతో 1,200 పెండింగ్ పీహెచ్‌డీలు రద్దు చేశామని ఆయన వివరించారు. 2018లో జాయిన్ అయిన విద్యార్థులకు 2023 జూన్ వరకు గడువు ఉందని.. ఆ లోపు థీసీస్ సబ్మిట్ చేయకపోతే అడ్మిషన్లు రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇక రద్దు చేయగా మిగిలిన ఖాళీలతో పాటు కొత్త అడ్మిషన్లను త్వరలో తీసుకుంటామని చెప్పారు. రీసెర్చ్ స్కాలర్లు తమ సమయం వృధా చేసుకోకుండా త్వరగా థీసీస్‌లు సబ్మిట్ చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్ఈపీని ఇంప్లిమెంట్ చేస్తున్న చాలా రాష్ట్రాలు పలు సమస్యలను ఎదుర్కుంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను తాము పరిగణలోకి తీసుకోబోమని చెప్పారు. అయితే ఎన్ఈపీలోని క్లస్టర్ సిస్టమ్‌ను మాత్రం అడాప్ట్ చేసుకుంటామని అన్నారు.
మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో బొటానికల్ గార్డెన్ , ఆక్సిజన్ పార్క్, సివిల్ సర్వీసెస్ అకాడమీని నిర్మించబోతున్నట్లు తెలిపారు. అలాగే సౌలతులు మెరుగుపరిచి, యూనివర్సిటీని అందంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు యునీక్ ఐడెంటిఫికేషన్ కార్డులు, వైఫై యాక్సెస్ పాయింట్లు, సీసీ టీవీ కెమేరాల వంటి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.
ALSO READ: స్పీకర్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు