ఆమె వల్లనే నారాయణకు బెయిల్‌?. సస్పెన్షన్‌ వేటు

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి నారాయణకు బెయిల్ తక్షణం రావడానికి చిత్తూరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటరే కారణం అంటూ ఆమెపై వేటు వేశారు. ఏపీపీ జి. సుజాతను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి సత్య ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ విషయాన్ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ సుజాతకు తెలియజేశారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టుకు వచ్చి వాదనలు […]

Advertisement
Update:2022-05-20 02:46 IST

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి నారాయణకు బెయిల్ తక్షణం రావడానికి చిత్తూరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటరే కారణం అంటూ ఆమెపై వేటు వేశారు. ఏపీపీ జి. సుజాతను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి సత్య ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.

నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ విషయాన్ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ సుజాతకు తెలియజేశారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టుకు వచ్చి వాదనలు వినిపించి, నారాయణను బెయిల్‌ రాకుండా అడ్డుకోవాలని, జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టేందుకు, కోర్టు నుంచి ఆదేశాలు వచ్చేలా వాదించాలని పోలీసు అధికారులు ఆమెను కోరారు. డీఎస్పీ కూడా స్వయంగా ఆమెకు ఫోన్ చేసి వాదనలు వినిపించేందుకు రావాల్సిందిగా కోరారు.

తీరా నారాయణను కోర్టులో హాజరుపరిచే సమయానికి ఆమె వాదనలు వినిపించేందుకు హాజరుకాలేదు. ప్రభుత్వం తరపున వాదించేందుకు ఏపీపీ రాకపోవడంతో నారాయణ బెయిల్ పొందడం ఈజీ అయిపోయింది. ఈ పరిణామంతో పోలీసులు కంగు తిన్నారు.

ఏపీపీ సుజాత వాదనలు వినిపించేందుకు రాకపోవడంపై జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి.. న్యాయశాఖ కార్యదర్శికి నివేదిక పంపారు.

నివేదిక పరిశీలించడంతో పాటు, సుజాత వ్యవహరించిన తీరుపై ఆరా తీసిన న్యాయశాఖ… ఆమె ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించారని, ఆమె ఇంకా సదరు పోస్టులో కొనసాగితే పక్షపాతంతో పనిచేస్తారంటూ సస్పెండ్ చేసింది.

అనుమతి లేకుండా జిల్లా కేంద్రం దాటి వెళ్లవద్దని కూడా ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆమె ఎందుకు అలా వ్యవహరించారు అన్న దానిపై విచారణ జరిపే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News