ఇట్లయితే పద్మశ్రీ అవార్డు వెనక్కు ఇచ్చేస్తా- మొగులయ్య
బీజేపీ నేతల తీరుపై పద్మ శ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. పద్మ అవార్డులతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇలాగైతే పద్మ అవార్డును వెనక్కు ఇచ్చేస్తానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ కిన్నెర కళను గుర్తించి జీవం పోశారని, ఆయన మేలు ఎన్నటికీ మరువలేమన్నారు. అచ్చెంపేట బీజేపీ నేత మంగ్యానాయక్ ఉద్దేశపూర్వకంగా తనను పిలిపించుకుని, సీఎం కేసీఆర్ ప్రకటించిన కోటి రూపాయలు ఇచ్చారా అంటూ అవహేళనగా మాట్లాడారన్నారు. తనకు తెలియకుండా దాన్ని వీడియో […]
బీజేపీ నేతల తీరుపై పద్మ శ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. పద్మ అవార్డులతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇలాగైతే పద్మ అవార్డును వెనక్కు ఇచ్చేస్తానని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ కిన్నెర కళను గుర్తించి జీవం పోశారని, ఆయన మేలు ఎన్నటికీ మరువలేమన్నారు. అచ్చెంపేట బీజేపీ నేత మంగ్యానాయక్ ఉద్దేశపూర్వకంగా తనను పిలిపించుకుని, సీఎం కేసీఆర్ ప్రకటించిన కోటి రూపాయలు ఇచ్చారా అంటూ అవహేళనగా మాట్లాడారన్నారు. తనకు తెలియకుండా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి, తనను అవమానించారని ఆవేదన చెందారు.
పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే, టీఆర్ఎస్ ప్రభుత్వం నీకు ఏమీ చేయడం లేదు, కోటి రూపాయలు కూడా కేసీఆర్ తన ఇంట్లో నుంచి ఏమీ ఇవ్వడం లేదని అవమానించారన్నారు. రెండేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం తనకు నెలనెల 10 వేల రూపాయల పింఛన్ ఇస్తోందని, పాఠ్యపుస్తకంలో చేర్చారని,కేసీఆర్ హయాంలోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు.
అవార్డు వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్తుంటే తోడుగా ఒక వ్యక్తిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు పంపించారని మొగులయ్య చెబుతున్నారు. దయచేసి బీజేపీ నేతలు తన నోట్లో మట్టికొట్టవద్దని, తానో పేదవాడినని తన నోట్లో మట్టి కొడితే పాపం తగులుతుందన్నారు. ఇటీవల కారులో వెళ్తున్న బీజేపీ నేత మంగ్యానాయక్‌తో మొగులయ్య కారు డోర్ వద్ద నిలబడి మాట్లాడారు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని.. అందరూ మీ పేరు చెబుతున్నారంటూ బీజేపీ నేతతో సాయం కోసం మొరపెట్టుకున్నారు. అందుకు కేసీఆర్ కోటి రూపాయలు ఇస్తానన్నారు కదా! ఇవ్వలేదా అని బీజేపీ నేత ప్రశ్నించగా.. మొగులయ్య ”ఛీ” ఇవ్వలేదు, ఇస్తామంటున్నారు అంటూ మాట్లాడారు. ఆ మాటలను కారులోని వారే రికార్డు చేశారు. సోషల్ మీడియాలో వదిలి.. కేసీఆర్‌ను మొగులయ్య కూడా తిడుతున్నారంటూ వైరల్ చేశారు. బీజేపీ నేతలు ఇలా చేయడంపై మొగులయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.