ఆ పని కూడా చేసుకోలేని దద్దమ్మ చంద్రబాబు

అధికారంలో ఉండగా కనీసం తన సొంత నియోజకవర్గ కేంద్రమైన కుప్పంను మున్సిపాల్టీగా, రెవెన్యూ డివిజన్ గా మార్చుకోలేని దద్దమ్మ చంద్రబాబు అని ధ్వజమెత్తారు మంత్రి రోజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు కడపకు వెళ్లి, సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్న తీరు హాస్యాస్పదం అని అన్నారామె. కుప్పంలో చంద్రబాబు కనీసం ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. కుప్పం-పులివెందుల మధ్య తేడా చూస్తే […]

Advertisement
Update:2022-05-19 07:04 IST

అధికారంలో ఉండగా కనీసం తన సొంత నియోజకవర్గ కేంద్రమైన కుప్పంను మున్సిపాల్టీగా, రెవెన్యూ డివిజన్ గా మార్చుకోలేని దద్దమ్మ చంద్రబాబు అని ధ్వజమెత్తారు మంత్రి రోజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు కడపకు వెళ్లి, సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్న తీరు హాస్యాస్పదం అని అన్నారామె. కుప్పంలో చంద్రబాబు కనీసం ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. కుప్పం-పులివెందుల మధ్య తేడా చూస్తే చంద్రబాబు ఎలాంటివారో ప్రజలకే అర్థమవుతుందని అన్నారు. కుప్పంను మున్సిపాల్టీగా, రెవెన్యూ డివిజన్ గా మార్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని చెప్పారు. ఆయన పారదర్శక పాలనకు అదే పెద్ద ఉదాహరణ అని అన్నారు.

శునకానందం ఎందుకు..?
గడప గడపకు వెళ్తున్న వైసీపీ నాయకుల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, ఆదరిస్తున్నారని చెప్పారు రోజా. అయితే టీడీపీ అనుకూలమీడియా మాత్రం వ్యతిరేక వార్తలు ఇస్తోందని మండిపడ్డారు. ఛానెల్స్ ఉన్నాయి కదా అని.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు జరుగుతున్నట్టు చూపిస్తున్నారని, అలాంటి వార్తలతో చంద్రబాబు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి జనం నీరాజనాలు పలుకుతున్నారని వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95శాతం అమలు చేశామని, అదే విషయాన్ని జనం కూడా అంగీకరించారని, తమని ఆదరిస్తున్నారని చెప్పారు రోజా.

2024 నినాదం అదే..
2024 ఎన్నికలో క్విట్ చంద్రబాబు – సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో జనంలోకి వెళ్తామని చెప్పారు రోజా. చంద్రబాబుకి గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు ఇచ్చి పూర్తిగా పక్కనపెట్టారని, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే లేకుండా ప్రజలు తరిమి తరిమి కొడతారని చెప్పారు. దమ్ముంటే టీడీపీ మేనిఫెస్టోతో చంద్రబాబు కుప్పంకు రావాలని సవాల్ విసిరారు రోజా. వైసీపీ నవరత్నాల మేనిఫెస్టోతో వస్తుందని.. ఎవరు తమ వాగ్దానాలు నెరవేర్చారో కుప్పంలోనే తేల్చుకుందామని చెప్పారు రోజా.

Tags:    
Advertisement

Similar News