లండన్ కోర్టులో నెగ్గిన ఆంధ్రప్రదేశ్
బాక్సైట్ సరఫరా ఒప్పందం రద్దు విషయంలో యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అధారిటీ( రాకియా)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏర్పడిన వివాదంపై లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఏపీ విజయం సాధించింది. విశాఖ జిల్లాలో రాకియా సంస్థ అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు చేసేలా, దానికి అవసరమైన బాక్సైట్‌ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేసేలా ఒప్పందం జరిగింది. 2007లో వైఎస్ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్దెత్తున […]
బాక్సైట్ సరఫరా ఒప్పందం రద్దు విషయంలో యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అధారిటీ( రాకియా)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏర్పడిన వివాదంపై లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఏపీ విజయం సాధించింది.
విశాఖ జిల్లాలో రాకియా సంస్థ అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు చేసేలా, దానికి అవసరమైన బాక్సైట్‌ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేసేలా ఒప్పందం జరిగింది. 2007లో వైఎస్ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది.
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్దెత్తున గిరిజనుల నుంచి ప్రతిఘటన రావడంతో ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసింది. దాంతో రాకియా సంస్థ కోర్టుకెళ్లింది. ఏపీ ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల.. బాక్సైట్ సరఫరా చేయకపోవడం వల్ల, తాము అల్యూమినియం ఫ్యాక్టరీపై పెట్టిన పెట్టుబడి నష్టపోయామని.. కాబట్టి నష్టపరిహారంగా 273 మిలియన్ డాలర్లు చెల్లించాలని రాకియా డిమాండ్ చేసింది.
ఇండియా,యూఏఈ మధ్య ఉన్న బైలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రీటి ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని కోర్టును ఆశ్రయించింది. కోర్టు బయట వివాదం పరిష్కరించుకుందామని ఏపీ ప్రభుత్వం కోరినా రాకియా అంగీకరించలేదు. లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో ఏపీ తరపు న్యాయవాదులు గట్టిగా వాదించారు. గిరిజనుల జీవితాలను కాపాడేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఒప్పందం రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. అసలు ఈ కేసు లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు పరిధిలోకి రాదని వాదించారు. ఇరుపక్షల వాదనలు విన్న కోర్టు.. ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని తీర్పు చెప్పింది. రాకియా పిటిషన్‌ను కొట్టివేసింది. ఇది ఏపీ ప్రభుత్వానికి లభించిన అతి పెద్ద విజయమని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది వ్యాఖ్యానించారు.