బీజేపీకి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా

  మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. తన రాజీనామా లేఖను రావెల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కిశోర్ బాబు తన లేఖలో తెలిపారు. ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేసిన రావెల తన రాజకీయ జీవితాన్ని తెల్కుగుదేశం పార్టీ ద్వారా ప్రారంభించారు. 2014 లో పత్తిపాడు నియోజకవర్గం నుండి తెలుగుదేశం […]

Advertisement
Update:2022-05-16 09:29 IST

 

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. తన రాజీనామా లేఖను రావెల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కిశోర్ బాబు తన లేఖలో తెలిపారు.

ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేసిన రావెల తన రాజకీయ జీవితాన్ని తెల్కుగుదేశం పార్టీ ద్వారా ప్రారంభించారు. 2014 లో పత్తిపాడు నియోజకవర్గం నుండి తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి కూడా వరించింది. పార్టీలో వర్గ పోరాటాల మూలంగా ఆయన 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడి పోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రావెల బీజేపీలో చేరారు. కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో కూడా క్రియాశీలంగా ఉండట‍ం లేదు.

ఈ రోజు బీజేపీకి రాజీనామా చేసిన రావెల కిశోర్ బాబు త్వరలోనే తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News