మహిళా ఐపీఎల్ కు కసరత్తులు.. 23 నుంచి మూడు జట్ల సమరం

ఐపీఎల్-15వ సీజన్ లీగ్ పోటీలు ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరిస్తుంటే.. మరోవైపు.. ఐపీఎల్ కు అనుబంధంగా మహిళా టీ-20 చాలెంజర్ ట్రోఫీ పోటీలకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ను మూడు జట్లు, 4 మ్యాచ్ లుగా నిర్వహించనున్నారు. 12 మంది విదేశీ ప్లేయర్లు.. మహిళా ఐపీఎల్ కోసం బీసీసీఐ గత కొద్దిసంవత్సరాలుగా చాలెంజర్ సిరీస్ […]

Advertisement
Update:2022-05-16 07:04 IST

ఐపీఎల్-15వ సీజన్ లీగ్ పోటీలు ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరిస్తుంటే.. మరోవైపు.. ఐపీఎల్ కు అనుబంధంగా మహిళా టీ-20 చాలెంజర్ ట్రోఫీ పోటీలకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ను మూడు జట్లు, 4 మ్యాచ్ లుగా నిర్వహించనున్నారు.

12 మంది విదేశీ ప్లేయర్లు..
మహిళా ఐపీఎల్ కోసం బీసీసీఐ గత కొద్దిసంవత్సరాలుగా చాలెంజర్ సిరీస్ ను నిర్వహిస్తూ వస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ మహిళా ఐపీఎల్ గా రూపాంతరం చెందటానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆస్ట్రేలియాలోని మహిళా బిగ్ బాష్ లీగ్ ను తలదన్నే రీతిలో మహిళా ఐపీఎల్ ను తీర్చిదిద్దాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. అంతేకాదు.. మహిళా ఐపీఎల్ లీగ్ ప్రసారహక్కుల కోసం.. ప్రముఖ మీడియా సంస్థల మధ్య గట్టిపోటీనే నెలకొనే అవకాశం ఉంది. ట్రైల్ బ్లేజర్స్, సూపర్ నోవా, వెలాసిటీ జట్ల తరఫున భారత అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్లతో పాటు.. వివిధ దేశాలకు చెందిన 12 మంది విఖ్యాత ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. మూడుజట్లు, నాలుగుమ్యాచ్ ల ఈ చాలెంజర్ సిరీస్ పోరులో పాల్గోనున్న విదేశీ స్టార్లలో ఇంగ్లండ్ కు చెందిన హిథర్ నైట్, ఆస్ట్ర్రేలియాకు చెందిన అలోనా కింగ్ ఇప్పటికే తాము అందుబాటులో ఉంటామని బీసీసీఐకి తెలిపారు. ఎకల్‌స్టోన్‌తో పాటు సోఫియా డంక్లీ, డానీ వ్యాట్‌, దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ లారా వొల్వార్డ్‌, మరిజానె కాప్‌, వెస్టిండీస్‌ స్టార్ ప్లేయర్ దియోంద్ర డాటిన్‌, హలే మాథ్యూస్‌ భాగస్వాములు కానున్నారు. ఆస్ట్రేలియా నుంచి అలానా మాత్రమే బరిలోకి దిగనుంది. నిరుడు ఈ టోర్నీ టైటిల్‌ను స్మృతి మందన నేతృత్వంలోని ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్టు చేజిక్కించుకోగా.. హర్మన్ ప్రీత్‌సింగ్‌ బృందం సూపర్‌నోవాస్‌ రన్నరప్‌గా నిలిచింది. మొత్తం మూడుజట్లకు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, మిథాలీరాజ్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News