మూడు రాజధానులపై ముందడుగు.. ఆగస్ట్-15 తర్వాత కీలక పరిణామం..

అమరావతిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మూడు రాజధానుల అంశం వెనకపడిపోయిందని అనుకుంటున్నారంతా. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులపై పట్టుదలతో ఉంది. కచ్చితంగా మూడు రాజధానులు ఏపీకి సాధించి తీరతామని గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ధీమాగా చెప్పారు. ఇప్పుడు మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ఆగస్ట్-15 తర్వాత ఎవరూ ఊహించని పరిణామం జరుగుతుందని అన్నారాయన. అనుకుంటే చేసి తీరతాం.. తమ ప్రభుత్వం ఏదైనా అనుకుంటే […]

Advertisement
Update:2022-05-16 16:02 IST

అమరావతిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మూడు రాజధానుల అంశం వెనకపడిపోయిందని అనుకుంటున్నారంతా. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులపై పట్టుదలతో ఉంది. కచ్చితంగా మూడు రాజధానులు ఏపీకి సాధించి తీరతామని గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ధీమాగా చెప్పారు. ఇప్పుడు మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ఆగస్ట్-15 తర్వాత ఎవరూ ఊహించని పరిణామం జరుగుతుందని అన్నారాయన.

అనుకుంటే చేసి తీరతాం..
తమ ప్రభుత్వం ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందని.. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు న్యాయరాజధాని ఇప్పటికే వచ్చేసిందని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పకూడదని, కానీ చెప్పకనే చెబుతున్నానంటూ లీకులిచ్చారు. అధికారికంగా ఇప్పుడు ఇంతకంటే ఇంకేం మాట్లాడనని అన్నారు సురేష్. ఆగస్టు 15 తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలుంటాయని, ఏం జరగుగుతాయో మీరే చూస్తారని సందిగ్ధంలో పడేశారు.

ఏపీ న్యాయ రాజధాని కర్నూలుకు పెద్ద కంపెనీలు, సెజ్ రాబోతున్నాయని మంత్రి సురేష్ వెల్లడించారు. ఏపీలో టౌన్ ప్లానింగ్‌ విభాగంలో అవినీతి ఉందని.. విజిలెన్స్, ఏసీబీ కేసులు దాదాపు 150 వరకు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. టౌన్ ప్లానింగ్ తీరు మారాల్సిన అవసరం ఉందన్నారు సురేష్. సిటీ ప్లానర్లు ఈ విషయంలో బాధ్యతగా ఉండాలని చెప్పారు. ప్రతిసారీ కిందిస్థాయి సిబ్బందిని బలిచేస్తే కుదరదని చెప్పారు.

అందుకే వికేంద్రీకరణ..
గత ప్రభుత్వం రాజధాని విషయంలో గ్రాఫిక్స్ మాత్రమే చేసిందని, అమరావతి చుట్టూ అభివృద్ధి అంటూ ఇన్‌ సైడర్ ట్రేడింగ్ చేసిందని ఆరోపించారు మంత్రి సురేష్. ఒకే సామాజిక వర్గం అభివృద్ధి చెందేలా అంతా పక్కా ప్లానింగ్ తో గత ప్రభుత్వం పనిచేసిందని విమర్శించారు. అందుకే వికేంద్రీకరణ మంత్రంతో అభివృద్ధి, పాలన అన్ని ప్రాంతాలకు అందేలా సమన్యాయం చేస్తున్నామని వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 95శాతం అమలు చేశామని చెప్పారు మంత్రి సురేష్.

Tags:    
Advertisement

Similar News