రూటు మార్చిన అసని.. కోస్తా తీరంలో రెడ్ అలర్ట్..

ముందు ఒడిశా తీరం అన్నారు, తర్వాత మచిలీపట్నం అన్నారు, ఆ తర్వాత బాపట్ల వస్తుందని భయపెట్టారు, తీరా ఇప్పుడు నరసాపురం తీరానికి దగ్గర్లో అల్లవరం సమీపంలో ‘అసని’ తుపాను తీరం తాకే అవకాశముందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. సహజంగా వేసవిలో వచ్చే తుపానులు తీరానికి దగ్గరగా వచ్చే వరకు వాటి దిశను అంచనా వేయడం కష్టం. ఈసారి ‘అసని’ విషయంలో కూడా అదే జరిగింది. పలుమార్లు తుపాను దిశను పసిగట్టడంలో అధికారుల అంచనాలు తప్పాయి. బలహీనపడిన […]

Advertisement
Update:2022-05-11 09:41 IST

ముందు ఒడిశా తీరం అన్నారు, తర్వాత మచిలీపట్నం అన్నారు, ఆ తర్వాత బాపట్ల వస్తుందని భయపెట్టారు, తీరా ఇప్పుడు నరసాపురం తీరానికి దగ్గర్లో అల్లవరం సమీపంలో ‘అసని’ తుపాను తీరం తాకే అవకాశముందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. సహజంగా వేసవిలో వచ్చే తుపానులు తీరానికి దగ్గరగా వచ్చే వరకు వాటి దిశను అంచనా వేయడం కష్టం. ఈసారి ‘అసని’ విషయంలో కూడా అదే జరిగింది. పలుమార్లు తుపాను దిశను పసిగట్టడంలో అధికారుల అంచనాలు తప్పాయి.

బలహీనపడిన తుపాను..
‘అసని’ తుపాను తీరం తాకడానికి ముందే బలహీనపడింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తుపాను మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కి.మీ., నరసాపురానికి 30కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. నరసాపురం తీరానికి సమీపంలో అల్లవరం దగ్గర తీరం తాకే అవకాశముందని ఐఎండీ తాజా అంచనా. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అల్లవరం వద్ద భూభాగంపైకి వచ్చిన తుపాను.. తిరిగి సాయంత్రంలోగా యానాం వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఈ ఉదయం తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీన పడిన ‘అసని’ సాయంత్రం తీరం తాకిన తర్వాత క్రమంగా మరింత బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. పూర్తిగా బలహీనపడే వరకూ తీరం వెంబడే పయనిస్తుందని అంచనా. తుపాను కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా రావడంతో ఈదురు గాలుల తీవ్రత తగ్గింది. తీరం దాటే వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని చెబుతున్నారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News