ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ.. దీన్నెలా తగ్గించాలంటే..
మనదేశంలోని మధ్య వయస్కుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి రక్తపోటు ఉందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. అసలెందుకు ఈ సమస్య ఇంతగా వేధిస్తోంది. గణాంకాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీఎంఆర్ నిర్వహించిని తాజా సర్వేలో దేశంలో ప్రతీ నలుగురి వయోజనుల్లో ఒకరికి హై బీపీ సమస్య వేధిస్తుందని వెల్లడైంది. వీరిలో కేవలం 12 శాతం మంది మాత్రమే బీపీని కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారని మిగతా వారు బీపీతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆ సర్వేలో తేలింది. స్టాటిస్టిక్స్ ఇవే.. […]
మనదేశంలోని మధ్య వయస్కుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి రక్తపోటు ఉందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. అసలెందుకు ఈ సమస్య ఇంతగా వేధిస్తోంది. గణాంకాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐసీఎంఆర్ నిర్వహించిని తాజా సర్వేలో దేశంలో ప్రతీ నలుగురి వయోజనుల్లో ఒకరికి హై బీపీ సమస్య వేధిస్తుందని వెల్లడైంది. వీరిలో కేవలం 12 శాతం మంది మాత్రమే బీపీని కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారని మిగతా వారు బీపీతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆ సర్వేలో తేలింది.
స్టాటిస్టిక్స్ ఇవే..
మనదేశంలోని మధ్య వయస్కుల్లో 28 శాతం మందికి అధిక రక్తపోటు ఉంది. వీరిలో 30 శాతం మందికి మాత్రమే తమకు రక్తపోటు సమస్య ఉందన్న విషయం తెలుసు. దాదాపు 72 శాతం మందికి తమకు ఉన్న సమస్య గురించి అవగాహన కూడా లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో..
పట్టణ ప్రాంతాల్లో 34 శాతం మందికి బీపీ సమస్య ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అది 25 శాతం మందికి ఉంది. పట్టణ ప్రాంతాల ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రక్తపోటు సమస్య గురించి, దాని ట్రీట్మెంట్ గురించి అవగాహన తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 59 శాతం మంది బీపీకి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే పట్టణ ప్రాంతాల్లోని 83 శాతం మంది బీపీ జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఇలా గుర్తించొచ్చు
బీపీ పెరగడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే బీపీను ఎట్టిపరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. శరీరంలోని కొన్ని లక్షణాల ద్వారా రక్తపోటును సులభంగా గుర్తించవచ్చు. తరచూ తలనొప్పి రావడం, తల బరువుగా అనిపించడం, ఛాతి నొప్పి, చూపు మందగించడం, తరచూ చెమటలు పట్టడడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బీపీ టెస్ట్ చేయించుకోవాలి.
జాగ్రత్తలు ఇలా..
రక్త పోటు సమస్య రాకుండా ఉండాలన్నా, హైబీపీ తగ్గాలన్నా.. ముందుగా ఉప్పు పదార్ధాలను తగ్గించాలి. అలాగే జంక్ ఫుడ్‌ను తగ్గించి పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మద్యపానం, స్మోకింగ్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.