అత్తారింట్లో బాత్రూం కట్టలేదని వివాహిత ఆత్మహత్య.. -పెళ్లైన నెలకే ఘటన

పెళ్లయేసరికి అత్తారింట్లో బాత్రూం లేకపోవడంతో వెంటనే కట్టాలని కోడలు కోరగా.. అత్తింటివారు పట్టించుకోకపోవడంతో పెళ్లైన నెలరోజులకే ఓ వివాహిత ప్రాణాలు తీసుకున్నది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చోటుచేసుకున్నది. పుదునగర్ కు చెందిన కార్తికేయన్.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న రమ్య (27) అనే యువతి కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. నెల రోజుల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. అయితే కార్తికేయన్ ఇంట్లో బాత్రూం లేకపోవడంతో రమ్య ఇబ్బందులు పడింది. ఈ […]

Advertisement
Update:2022-05-10 14:12 IST

పెళ్లయేసరికి అత్తారింట్లో బాత్రూం లేకపోవడంతో వెంటనే కట్టాలని కోడలు కోరగా.. అత్తింటివారు పట్టించుకోకపోవడంతో పెళ్లైన నెలరోజులకే ఓ వివాహిత ప్రాణాలు తీసుకున్నది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చోటుచేసుకున్నది.

పుదునగర్ కు చెందిన కార్తికేయన్.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న రమ్య (27) అనే యువతి కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. నెల రోజుల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. అయితే కార్తికేయన్ ఇంట్లో బాత్రూం లేకపోవడంతో రమ్య ఇబ్బందులు పడింది. ఈ విషయాన్ని భర్తతో కూడా చెప్పింది. అయితే త్వరలోనే ఇంట్లో బాత్రూం కడతానని కార్తికేయన్ రమ్యకు చెప్పాడు. లేదంటే వేరే అద్దెంటికి మారిపోదామన్నాడు. కానీ రోజులు గడుస్తున్నా అతడు ఈ విషయంపై స్పందించ లేదు. దీంతో సోమవారం రమ్య.. ఈ విషయంపై కార్తికేయన్ ను నిలదీసింది. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

ఈ ఘటన జరిగిన తర్వాత కార్తికేయన్ రమ్యను పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. బాత్రూం కట్టాలని చెప్పినా పట్టించుకోకపోవడం, దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తీవ్ర మ‌న‌స్తాపం చెందిన రమ్య.. మంగళవారం ఉదయం తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను పుదుచ్చేరిలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

Tags:    
Advertisement

Similar News