బాబూ.. పవన్ కోసం సీఎం సీటును త్యాగం చేస్తారా? " ప్రభుత్వ సలహాదారు సజ్జల
రాష్ట్రంలో పొత్తులపై రాజకీయాలు జోరందుకున్నాయి. వైసీపీని ఓడించేందుకు తాను త్యాగాలకు సిద్ధమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని జనసేనాని పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం తాము సింగిల్ గానే బరిలోకి దిగుతామని అంటున్నారు. ఈ తాజా పరిణామాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘ పవన్ కల్యాణ్ కు ఓ రాజకీయ విధానం అంటూ లేదు. ఆయన చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ. బాబు ఆడించినట్టు ఆడుతుంటారు. గతంలోనూ వీరి […]
రాష్ట్రంలో పొత్తులపై రాజకీయాలు జోరందుకున్నాయి. వైసీపీని ఓడించేందుకు తాను త్యాగాలకు సిద్ధమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని జనసేనాని పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం తాము సింగిల్ గానే బరిలోకి దిగుతామని అంటున్నారు. ఈ తాజా పరిణామాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘ పవన్ కల్యాణ్ కు ఓ రాజకీయ విధానం అంటూ లేదు. ఆయన చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ. బాబు ఆడించినట్టు ఆడుతుంటారు.
గతంలోనూ వీరి మధ్య మైత్రి ఉంది. ఇప్పటికీ కొనసాగుతోంది. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఆయన చెప్పినట్టుగా నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంటే ఒంటరిగానే పోటీచేసి గెలవొచ్చు కదా.. కానీ అలా చేయలేరు. ఎందుకంటే ఎలాగూ ఓడిపోతానని బాబుకు తెలుసు. అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు.
ఇక రాజకీయ అజ్ఞాని పవన్ కల్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు చిలకపలుకులు పలుకుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో? అర్థం కావడం లేదు. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటారు. మళ్లీ బీజేపీతో తన మైత్రి కొనసాగుతుందని చెబుతారు. బీజేపీ వాళ్లేమో.. చంద్రబాబుతో పొత్తు లేదని చెబుతారు. వీళ్లందరి వైఖరి గందరగోళంగా ఉంది.
రాష్ట్ర ప్రజలు ఎంతో స్పష్టతతో ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేపపథకాలతో వాళ్లంతో సంతోషంగా ఉన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం భ్రమల్లో బతుకుతున్నారు. ’ అని సజ్జల పేర్కొన్నారు. ‘చంద్రబాబు నాయుడు తాను ఏ త్యాగానికైనా సిద్ధం అని ప్రకటించారు కదా.. మరి పవన్ కల్యాణ్ కోసం సీఎం సీటును త్యాగం చేస్తారా?’ అని ప్రశ్నించారు.