పవన్.. ఏ పార్టీతో నీ పొత్తు? కాస్త క్లారిటీ ఇవ్వు.. " మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్రంలో ప్రస్తుతం పొత్తులపై రాజకీయం హాట్‌హాట్‌గా నడుస్తోంది. నిన్న పవన్ కల్యాణ్ నంద్యాలలో మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది. తాజాగా ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ‘చంద్రబాబును జనం నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన పాలన చూసి విసిగిపోయారు. ఆ విషయంపై బాబుకు కూడా అర్థమైంది. అందుకే పొత్తులకోసం వెంపర్లాడుతున్నారు. సీఎం జగన్ కు ప్రజల్లో ఆదరణ ఉంది. అందుకే మేము […]

Advertisement
Update:2022-05-09 13:26 IST

రాష్ట్రంలో ప్రస్తుతం పొత్తులపై రాజకీయం హాట్‌హాట్‌గా నడుస్తోంది. నిన్న పవన్ కల్యాణ్ నంద్యాలలో మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది. తాజాగా ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ‘చంద్రబాబును జనం నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన పాలన చూసి విసిగిపోయారు. ఆ విషయంపై బాబుకు కూడా అర్థమైంది. అందుకే పొత్తులకోసం వెంపర్లాడుతున్నారు.

సీఎం జగన్ కు ప్రజల్లో ఆదరణ ఉంది. అందుకే మేము ధైర్యంగా ఉన్నాం. ఇక చంద్రబాబు, పవన్ కల్యాణ్ తోడు దొంగలు. పవన్ కు రాజకీయాలే తెలియదు. చంద్రబాబు ఆడమన్నట్టు ఆడుతారు.ఆయన ఓ వైపు బీజేపీతో పొత్తు పెట్టుకొని.. టీడీపీతో పొత్తుకోసం ఆరాటపడుతున్నాడంటే ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.

పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ప్రజలకు చెప్పాలి. ఆయనేమో బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతాడు.. టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్టు పరోక్ష సంకేతాలు ఇస్తాడు. ఇక బీజేపీ యేమో తాము టీడీపీతో కలిసే ప్రసక్తే లేదంటుంది. మరి ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నాడో చెప్పాలి’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News