అద్భుతం జరుగుతుంది.. ఏపీలో ప్రత్యామ్నాయం వస్తుంది..

ఏపీలో అద్భుతం జరుగుతుందని, వైసీపీకి ప్రత్యామ్నాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. నంద్యాల జిల్లాలో రైతు కుటుంబాలను పరామర్శించిన ఆయన.. ఏపీలో వైసీపీని గద్దె దించుతామని ధీమాగా చెప్పారు. పార్టీల మధ్య పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడాలని, వ్యక్తిగత ఎదుగుదల కోసం తానెప్పుడూ పొత్తులు పెట్టుకోలేదని చెప్పారు. లాభాపేక్ష చూసుకోను, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని స్ఫష్టం చేశారు. ఏపీలో వైసీపీ పాలన వల్లే తాను ఈ మాట అనాల్సి వస్తోందని […]

Advertisement
Update:2022-05-08 13:10 IST

ఏపీలో అద్భుతం జరుగుతుందని, వైసీపీకి ప్రత్యామ్నాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. నంద్యాల జిల్లాలో రైతు కుటుంబాలను పరామర్శించిన ఆయన.. ఏపీలో వైసీపీని గద్దె దించుతామని ధీమాగా చెప్పారు. పార్టీల మధ్య పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడాలని, వ్యక్తిగత ఎదుగుదల కోసం తానెప్పుడూ పొత్తులు పెట్టుకోలేదని చెప్పారు. లాభాపేక్ష చూసుకోను, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని స్ఫష్టం చేశారు. ఏపీలో వైసీపీ పాలన వల్లే తాను ఈ మాట అనాల్సి వస్తోందని చెప్పారు పవన్ కల్యాణ్. ఏపీలో సమస్యల్ని చూసి రాష్ట్ర భవిష్యత్తుకోసం బలమైన వ్యక్తులంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేనాని.

బీజేపీతో బంధం బలంగానే ఉంది కానీ..!
బీజేపీతో జనసేన అనుబంధం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు పవన్ కల్యాణ్. బీజేపీతో వందశాతం పొత్తు కొనసాగుతోందని, అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరెవరు కలిసొస్తారో ఈరోజుకీ తనకు తెలియదని, కానీ ప్రత్యామ్నాయ ప్రభుత్వం అనేది తన కోరిక అని అన్నారు. ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉంది కాబట్టి.. అందరూ ఈ విషయంపై చర్చించాలని, ఏపీ భవిష్యత్తు కోసం అందరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు.

రోడ్ మ్యాప్ ఇచ్చారా.. ?
గతంలో బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇస్తుందని ఎదురు చూస్తున్నానంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయనకు కావాల్సిన రోడ్ మ్యాప్ ఎప్పుడో ఇచ్చేశామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు వీర్రాజు అన్నారు. ఈ రెండిటినీ మీడియా ప్రస్తావించగా.. రోడ్ మ్యాప్ ఇచ్చానని ఆయన అన్నారా.. ఓసారి చెక్ చేసి చెప్తాను అని సమాధానమిచ్చారు పవన్. రాష్ట్రంలో తాము ఒంటరిగా ప్రజా పోరాటాలు చేయడంలేదని, ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళ్తామంటున్నారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News