పవన్ .. రాష్ట్రంలో జరగబోయే అద్భుతం ఇదే.. మంత్రి జోగి రమేశ్..!

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎలా కాపాడతారు? అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. ఏదైనా అద్భుతం జరగబోతుందేమో చూద్దాం.. అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆదివారం పవన్ కల్యాణ్ నంద్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా ఈ విమర్శలకు మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘రాష్ట్రంలో అద్భుతం జరగబోతుంది నిజమే.. అదేమిటంటే.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడమే’ అని జోగి రమేశ్ […]

Advertisement
Update:2022-05-08 14:06 IST

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎలా కాపాడతారు? అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. ఏదైనా అద్భుతం జరగబోతుందేమో చూద్దాం.. అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆదివారం పవన్ కల్యాణ్ నంద్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా ఈ విమర్శలకు మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు.

‘రాష్ట్రంలో అద్భుతం జరగబోతుంది నిజమే.. అదేమిటంటే.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడమే’ అని జోగి రమేశ్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ వ్యభిచారిగా మారిపోయారని మండిపడ్డారు. ఓ వైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే.. మరోవైపు టీడీపీతో పొత్తు కోసం వెంపర్లాడటం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 150 కంటే ఎక్కువ సీట్లలో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

‘జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఏదో జరగబోతుందని పవన్ కల్యాణ్ అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా జనసేనాని చంద్రబాబుతో అప్రకటిత పొత్తు కొనసాగించారు కదా.. వైసీపీ అధికారంలోకి రాకూడదని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలని ఆయన బీఎస్పీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు కదా.. అయినా వైసీపీ గెలిచింది. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మాత్రం నష్టం ఏమిటి? పవన్ కల్యాణ్ కు ఓ రాజకీయ సిద్ధాంతం అంటూ లేదు. జగన్ మీద ద్వేషం తప్ప అతడికి ఓ ఆశయం లేదు.

పవన్ కల్యాణ్ మీద వ్యక్తిగత దాడి చేయాల్సిన అవసరం వైసీపీకి ఏంటి? ఆయనను మేము అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. టీడీపీతో కలిసి ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే..కచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెబుతాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసినా మాకు ఏ నష్టం లేదు. మరోసారి ప్రజల మద్దతుతో మేమే గెలుస్తాం’ అని జోగి రమేశ్ పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News