భారత హాకీ జట్టు సరికొత్త చరిత్ర.. 3వ ర్యాంక్ లో పురుషుల జట్టు

అంతర్జాతీయ స్థాయిలో గత కొద్ది సంవత్సరాలుగా.. నిలకడగా రాణిస్తున్న భారత హాకీ జట్ల కష్టానికి తగిన ఫలితం దక్కింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత పురుషుల, మహిళల జట్లు అత్యుత్తమ ర్యాంకుల్లో నిలిచాయి. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలతో పాటు.. అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహించే పలు టోర్నీలలో భారత పురుషుల, మహిళల జట్లు నిలకడగా రాణించడం ద్వారా ప్రపంచ అగ్రశ్రేణి జట్లుగా కొనసాగుతున్నాయి. ప్రో-హాకీలీగ్ లో టాప్ […]

Advertisement
Update:2022-05-03 07:15 IST

అంతర్జాతీయ స్థాయిలో గత కొద్ది సంవత్సరాలుగా.. నిలకడగా రాణిస్తున్న భారత హాకీ జట్ల కష్టానికి తగిన ఫలితం దక్కింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత పురుషుల, మహిళల జట్లు అత్యుత్తమ ర్యాంకుల్లో నిలిచాయి. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలతో పాటు.. అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహించే పలు టోర్నీలలో భారత పురుషుల, మహిళల జట్లు నిలకడగా రాణించడం ద్వారా ప్రపంచ అగ్రశ్రేణి జట్లుగా కొనసాగుతున్నాయి.

ప్రో-హాకీలీగ్ లో టాప్ గేర్..
అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఇటీవలే నిర్వహించిన 2022 ప్రో-హాకీలీగ్ లో భారత పురుషుల జట్టు నాలుగు రౌండ్లలో మూడు విజయాలు, ఓ డ్రా రికార్డుతో తన పాయింట్లను గణనీయంగా పెంచుకోగలిగింది. ఇప్పటి వరకూ మూడోర్యాంక్ లో ఉన్న నెదర్లాండ్స్ ను నాలుగో ర్యాంక్ కు నెట్టిన భారతజట్టు 2,503 పాయింట్లతో తొలిసారిగా మూడో ర్యాంక్ జట్టుగా నిలిచింది. 2,842 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్ లో నిలువగా.. బెల్జియం 2,763 పాయింట్లతో రెండోర్యాంక్ లో కొనసాగుతోంది.

7వ ర్యాంకులో మహిళా జట్టు..
మహిళల ప్రొ లీగ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సంపాదించిన భారత జట్టు.. మొత్తం 2,029 పాయింట్లతో ఏడోర్యాంక్ కు ఎగబాకగలిగింది, అంతర్జాతీయ హాకీ సమాఖ్య ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టిన తరువాత భారత పురుషుల జట్టు 3, మహిళల జట్టు 7వ ర్యాంక్ లో నిలవడం ఇదే మొదటిసారి.

Tags:    
Advertisement

Similar News