2 శాతం రిజర్వేషన్ ఉంటే.. ఒకే ఒక్క పోస్టా? క్లారిటీ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల్లో భాగంగా 503 గ్రూప్-1 పోస్టులకు ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్‌లో స్పోర్ట్స్ కోటాలో కేవలం ఓకే ఒక పోస్ట్ ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయ్యింది. రాష్ట్రంలో 2 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేస్తుండగా.. కనీసం 10 పోస్టులైనా స్పోర్ట్స్ కోటాలో ఉంటాయనుకుంటే.. కమిషన్ మాత్రం ఒకటి మాత్రమే ప్రకటించడంపై నిరుద్యోగులు నిరసన వ్యక్తం […]
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల్లో భాగంగా 503 గ్రూప్-1 పోస్టులకు ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్‌లో స్పోర్ట్స్ కోటాలో కేవలం ఓకే ఒక పోస్ట్ ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయ్యింది. రాష్ట్రంలో 2 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేస్తుండగా.. కనీసం 10 పోస్టులైనా స్పోర్ట్స్ కోటాలో ఉంటాయనుకుంటే.. కమిషన్ మాత్రం ఒకటి మాత్రమే ప్రకటించడంపై నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కొంత మంది టీఎస్‌పీఎస్సీ అధికారులను కలిసి విన్నవించారు. కాగా, దీనిపై కమిషన్ క్లారిటీ ఇచ్చింది.
గ్రూప్-1 పోస్టుల నోటిఫికేషన్ విషయంలో కొత్త రోస్టర్ ప్రకారమే రిజర్వేషన్లు కేటాయించామని అధికారులు చెప్పారు. తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని 22, 22ఏ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు స్థిరమైన రోస్టర్ సైకిల్ ఉంటుందని చెప్పింది. ప్రతీ రిక్రూట్‌మెంట్ సమయంలో ప్రతీ పోస్టుకు రోస్టర్ సైకిల్ పాయింట్లు కేటాయిస్తామని వెల్లడించారు. గతంలో రాష్ట్రమంతటా ఒకే రోస్టర్ పాయింట్లు ఉండగా.. ఇప్పుడు రెండు మల్టీ జోన్లకు వేర్వేరు కొత్త రోస్టర్లు అమలు చేశామని అధికారులు అంటున్నారు.
స్పోర్ట్స్ కోటాలో 48, 98 పాయింట్ల కింద పోస్టులు రిజర్వు అవుతాయి. అంటే 48 పాయింట్లు వరకు ఉన్న పోస్టుల్లోనే స్పోర్ట్స్ కోటా అమలులోకి వస్తుందని అధికారులు చెప్పారు. గ్రూప్-1లో మల్టీజోన్ 1లో 72 ఎంపీడీవో పోస్టులు ఉన్నాయి. దీంతో 48వ పాయింట్ కింద ఒక స్పోర్ట్స్ కోటా పోస్టు వచ్చింది. మల్టీ జోన్ 2లో 49 ఎంపీడీవో పోస్టులు ఉన్నాయి. అయితే దీంట్లో కూడా 48వ పాయింట్ వద్ద ఒక పోస్టు రావాలని అడుగుతున్నారు. అయితే, ఈ 49లో 5 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. అంటే తాజా పోస్టులు 44 కావడంతో 48వ రోస్టర్ పాయింట్ వద్ద ఉన్న స్పోర్ట్స్ కోటా దీనికి వర్తించలేదు. దీంతో గ్రూప్-1లో మొత్తం స్పోర్ట్స్ కోటా కింద కేవలం ఒకే ఒక పోస్టు అలాట్ అయినట్లు అధికారులు వివరణ ఇచ్చారు.
రెండు వేర్వేరు మల్టీజోన్ల ప్రకారం నోటిఫై చేసిన పోస్టులకు ఒకే చోట కలిపి రోస్టర్ పాయింట్ అలాట్ చేయడం కుదరదని.. ఇది ఉత్తర్వులకు పూర్తిగా విరుద్దమని అధికారులు స్పష్టం చేశారు.