ఏపీలో డిగ్రీ స్వరూప స్వభావాలు మారిపోతాయా..?

ఇంజినీరింగ్ చదువులపై మోజు పెరిగిన తర్వాత ఏపీలో డిగ్రీలకు కాలం చెల్లింది. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివేవారు బాగా తగ్గిపోయారు. తమ పిల్లలు డిగ్రీ చదివితే ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటాయనే అపనమ్మకం కూడా తల్లిదండ్రుల్లో పెరిగిపోయింది. అయితే సీఎం జగన్ డిగ్రీ కోర్సులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. డిగ్రీ స్వరూప స్వభావాలు మార్చాలని, భారత్ లో ఎవరైనా డిగ్రీ చదవాలంటే కచ్చితంగా ఏపీవైపు చూసేలా కోర్సులను తీర్చిదిద్దాలని సూచించారు. డిగ్రీ […]

Advertisement
Update:2022-04-30 09:20 IST

ఇంజినీరింగ్ చదువులపై మోజు పెరిగిన తర్వాత ఏపీలో డిగ్రీలకు కాలం చెల్లింది. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివేవారు బాగా తగ్గిపోయారు. తమ పిల్లలు డిగ్రీ చదివితే ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటాయనే అపనమ్మకం కూడా తల్లిదండ్రుల్లో పెరిగిపోయింది. అయితే సీఎం జగన్ డిగ్రీ కోర్సులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. డిగ్రీ స్వరూప స్వభావాలు మార్చాలని, భారత్ లో ఎవరైనా డిగ్రీ చదవాలంటే కచ్చితంగా ఏపీవైపు చూసేలా కోర్సులను తీర్చిదిద్దాలని సూచించారు.

డిగ్రీ కోర్సు కోసం ప్రత్యేక యూనివర్శిటీ..
ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం వంటి విప్లవాత్మక మార్పులతో ఏపీలో విద్యావ్యవస్థ రూపు మార్చుకుంటోంది. ఇప్పుడిక డిగ్రీ విద్యపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సులకు జేఎన్టీయూ లాగా.. భవిష్యత్తులో డిగ్రీ కోర్సులకు కూడా ఒక ప్రత్యేక యూనివర్శిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. డిగ్రీ చదువుతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా స్కిల్ డెవలప్ మెంట్ పై కూడా దృష్టి సారించబోతోంది.

ఇంటర్న్ షిప్ తప్పనిసరి..
డిగ్రీ కోర్సుల్లో చేయబోతున్న మార్పుల్లో ఇంటర్న్ షిప్ అనేది ప్రధానం కాబోతోంది. డిగ్రీ చదివే మూడేళ్లకాలంలో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 10 నెలల ఇంటర్న్ షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 2 నెలలు, సెకండ్ ఇయర్ 2 నెలలు, ఫైనల్ ఇయర్ 6 నెలలు ఇంటర్న్ షిప్ చేయాలి. ప్రస్తుతం ఇంజినీరింగ్ లోనే ఇలాంటి ఇంటర్న్ షిప్ అవకాశం ఉంది. ఇకపై నైపుణ్యాలను వృద్ధి చేసేందుకు డిగ్రీలో కూడా దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీల స్థాయికి తీసుకెళ్లి, ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ ఉండేట్టు చర్యలు తీసుకోబోతున్నారు. విదేశాల్లో డిగ్రీని అత్యుత్తమ కోర్సుగా భావిస్తున్నట్టే.. ఏపీలో కూడా డిగ్రీతో ఉపాధి కచ్చితంగా ఉంటుందనే భావన తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఈ ప్రతిపాదనలన్నీ పూర్తి స్థాయలో అమలులోకి వస్తే ఇంజినీరింగ్ వల్ల కళతప్పిన డిగ్రీకోర్సులకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్టే.

Tags:    
Advertisement

Similar News