దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలి.. భారత రాష్ట్ర సమితికి ప్రతిపాదనలు ఉన్నాయి.. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్

టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో పార్టీ ప్లీనరీ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలుత సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన‌.. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఇప్పుడు దేశానికే రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని, కేంద్ర, పలు సంస్థల నుంచి వస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. […]

Advertisement
Update:2022-04-27 10:00 IST

టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో పార్టీ ప్లీనరీ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలుత సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన‌.. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఇప్పుడు దేశానికే రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని, కేంద్ర, పలు సంస్థల నుంచి వస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. దేశంలోని ఉత్తమ గ్రామాల జాబితాలో తొలి 10 తెలంగాణకు చెందిన గ్రామాలే ఉన్నాయని ఆయన చెప్పారు.

భారత రాష్ట్ర సమితికి ప్రతిపాదనలు వస్తున్నాయి..
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర ఫలాలు లభించాల్సిన పద్దతిలో లభించలేదు. ఇప్పుడు సమాజంలో, దేశంలో అవాంఛితమైన, అనవసరమైన పెడధోరణులు పెరుగుతున్నాయి. దేశ పరిరక్షణ కోసం మనం కృషి చేయాల్సి ఉన్నది. లేకపోతే దేశ ఉనికికే ముప్పు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మంచిగా చదువుకున్న వాళ్లకు కూడా కొన్ని అంశాలపై అవగాహన లేకపోవడం బాధాకరం. ఇప్పుడు దేశానికి రాజకీయ ఫ్రంట్‌లు అవసరం లేదు. ప్రత్యామ్నాయ అజెండాను రూపొందించాల్సిన అవసరం ఉంది. నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానం రావల్సి ఉన్నది. ప్రత్యామ్నాయ రాజకీయఅజెండా వేరెవరినో ప్రధానిని చేసేందుకు కాదు. ఇరవై ఏండ్ల క్రితం నేను తెలంగాణ గురించి మాట్లాడితే అందరూ వింతగా చూశారు. తిన్నది అరగట్లేదా అని ఎద్దేవా చేశారు. కానీ తల్లిదండ్రులకు, దేవుడికి దండం పెట్టి ముందుకు అడుగు వేశాను.

ఈ 20 ఏళ్లలో మన తెలంగాణ ఎలాంటి స్థితిలో ఉందో చూడండి. అనేక మంది ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణకు వలస వచ్చి ఉంటున్నారు. ఇండియాలో కూడా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అభివృద్ది చేయాలనే సంకల్పం, చిత్తశుద్ది ఉంటే తప్పకుండా జరిగి తీరుతుంది. అందుకే దేశ గతి, స్థితి మార్చడానికి కొత్త అజెండా రావాలి. హైదరాబాద్ వేదికగానే అది రావాలని కోరుకుంటున్నాను. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రావాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. కొత్త రాజకీయ అజెండా కోసం నేను కూడా ఆసక్తి చూపిస్తున్నాను.

గవర్నర్ వ్యవస్థను దుర్మార్గంగా మార్చేశారు..
గవర్నర్ అంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను దుర్మార్గంగా మార్చేశారు. మహారాష్ట్ర గవర్నర్ ఒక కీలకఫైల్ ముందుకు కదలకుండా దగ్గర పెట్టుకున్నాడు. తమిళనాడులోనూ ఒక బిల్లు విషయంలో గవర్నర్ అదే పద్దతిలో వ్యవహరిస్తున్నాడు. బెంగాళ్, కేరళ.. ఇలా ఏ రాష్ట్రంలో చూసినా గవర్నర్ల పంచాయితీలే నడుస్తున్నాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టి అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గమైన పద్దతుల్లో గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి ఆయనను సీఎం పదవి నుంచి దిందేశారని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత ఏమైంది ? మళ్లీ ఎన్టీఆర్ గద్దెను ఎక్కలేదా..? అని ప్రశ్నించారు. చివరకు ఆ గవర్నరే అవమానకర రీతిలో రాష్ట్రం విడిచి వెళ్లాడనే విషయాన్ని గుర్తు చేశారు. దాని నుంచైనా బుద్ది రావొద్దా.. ప్రజాస్వామ్యంలో పరిణితితో నేర్చుకోవద్దా అని పరోక్షంగా గవర్నర్‌, బీజేపీకి చురకలంటించారు.

Advertisement

Similar News