బెంగాల్ బీజేపీలో ముసలం..

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ని మట్టికరిపించేస్తుందన్నంతగా ప్రచారం జరిగింది. అయితే అధికారం అందుకోలేకపోయినా బీజేపీ మెరుగైన ప్రదర్శనే చేసింది. కానీ ఆ తర్వాతే ఎమ్మెల్యేలను నిలుపుకోలేకపోయింది. మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా ఓడించామన్న తృప్తి కొన్ని రోజులు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మిగల్లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి క్యూ కట్టారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలోనే లుకలుకలు మొదలయ్యాయి. చింతన్ బైఠక్ లో నిరసన స్వరాలు.. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో […]

Advertisement
Update:2022-03-07 03:20 IST

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ని మట్టికరిపించేస్తుందన్నంతగా ప్రచారం జరిగింది. అయితే అధికారం అందుకోలేకపోయినా బీజేపీ మెరుగైన ప్రదర్శనే చేసింది. కానీ ఆ తర్వాతే ఎమ్మెల్యేలను నిలుపుకోలేకపోయింది. మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా ఓడించామన్న తృప్తి కొన్ని రోజులు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మిగల్లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి క్యూ కట్టారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలోనే లుకలుకలు మొదలయ్యాయి.

చింతన్ బైఠక్ లో నిరసన స్వరాలు..
ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం పాలైంది. 108 మున్సిపాల్టీల్లో 102 చోట్ల టీఎంసీ గెలవగా మిగతా చోట్ల వామపక్షాలకు అవకాశం వచ్చింది. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి మాత్రం ఒక్క మున్సిపాల్టీ కూడా దక్కలేదు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 38శాతం ఓట్లు రాగా.. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 13శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి, గెల్చుకున్న మున్సిపల్ చైర్మన్ సీట్ల సంఖ్య సున్నా. దీంతో బీజేపీలో అంతర్మథనం మొదలైంది. మరోవైపు ఎన్నికలపై సమీక్ష కోసం పెట్టుకున్న చింతన్ బైఠక్ లో ఎంపీ లాకెట్ ఛటర్జీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఆఫీస్ బేరర్ల నియామకం ప్రతిభ ఆధారంగా జరగలేదన్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ బీజేపీలో కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. లాకెట్ ఛటర్జీ వ్యాఖ్యలపై మండి పడ్డారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు సరికాదన్నారు.

వేర్ ఈజ్ సువేందు..?
ఈ మొత్తం వ్యవహారంలో సువేందు అధికారి మిస్సవ్వడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. టీఎంసీని వదిలి బీజేపీలో చేరిన సువేందు మమతాకు ప్రత్యర్థిగా మారి ఆమెను ఎమ్మెల్యేగా ఓడించి తన పట్టు నిలుపుకున్నారు. అయితే పార్టీ అధికారంలోకి రాకపోవడంతో సువేందు దూకుడుకి కళ్లెం పడింది. కేవలం బెంగాల్ లో ప్రతిపక్ష నేతగా మాత్రమే ఆయన కొనసాగుతున్నారు. అటు బీజేపీలో కూడా సీనియర్ నేతలే పెత్తనం చెలాయిస్తున్నారు. తాజాగా జరిగిన చింతన్ బైఠక్ కి కూడా సువేందు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లుగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. బెంగాల్ లో బీజేపీ ఇక చీలికలు పేలికలు కావడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. అదను చూసి.. మిగతా ఎమ్మెల్యేలను కూడా తమవైపు తిప్పుకోడానికి టీఎంసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Tags:    
Advertisement

Similar News