కేసీఆర్ మ్యాజిక్.. 2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్..

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న వేళ, రాష్ట్రంలో ప్రతిపక్షాలను పూర్తిగా అణగదొక్కాలనుకుంటున్న వేళ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేసీఆర్ ముద్ర స్పష్టంగా కనపడింది. 2.56 లక్షల కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. దళిత బంధుకి పెద్దపీట.. ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈ ఏడాది నిధులు భారీగా పెంచారు. 17,700 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. హుజూరాబాద్ నియోజకవర్గం సహా […]

Advertisement
Update:2022-03-07 10:44 IST

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న వేళ, రాష్ట్రంలో ప్రతిపక్షాలను పూర్తిగా అణగదొక్కాలనుకుంటున్న వేళ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేసీఆర్ ముద్ర స్పష్టంగా కనపడింది. 2.56 లక్షల కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి హరీష్ రావు.

దళిత బంధుకి పెద్దపీట..
ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈ ఏడాది నిధులు భారీగా పెంచారు. 17,700 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. హుజూరాబాద్ నియోజకవర్గం సహా మరికొన్ని మండలాల్లో దళిత బంధు అమలు చేయగా.. ఈ ఏడాది.. రాష్ట్ర వ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున 11,800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిచబోతోంది తెలంగాణ ప్రభుత్వం.

పింఛన్ వయసు 57కి తగ్గింపు..
సామాజిక పింఛన్ వయసుని 65 సంవత్సరాలనుంచి 57 సంవత్సరాలకి తగ్గిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. ఆసరా పింఛన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో రూ.11728 కోట్లను ప్రతిపాదించారు.

ఇళ్ల నిర్మాణాలకు 12వేల కోట్లు..
సొంత స్థలం కలిగినవారు తమ స్థలంలో డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టుకోడానికి ముందుకొస్తే ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం 12వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు నేతలు.

రైతుబంధు పేరుతో ఇప్పటికే అన్నదాతలకు భారీగా ఆర్థిక సాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఈ ఏడాది సాయాన్ని మరింత పెంచింది. ఈ ఏడాది 75 వేల రూపాయల లోపు రుణాల‌ను కూడా మాఫీ చేయాల‌ని నిర్ణయించింది. ఈ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మొత్తంగా 24,254 కోట్ల రూపాయలు కేటాయించారు.

మనబడికి 7,289కోట్లు..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా మనఊరు- మనబడి పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులు చేపడతామంటోంది. మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతోపాటు 100కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు. కొత్తగా అటవీ విశ్వ విద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

రెండేళ్లలోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నూతన మెడికల్‌ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్‌ లో వెయ్యికోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.

రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.1542 కోట్లు, మెట్రో రైలును పాత‌బ‌స్తీలో 5.5 కిలోమీటర్ల మేర అనుసంధానించేందుకు రూ.500 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం టూరిజం సర్య్యూట్‌ కు రూ.750 కోట్లు, అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు, ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రూ.1500 కోట్లు, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీకోసం రూ.500 కోట్లు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ.2142 కోట్లు, పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద రూ.190 కోట్లు కేటాయించారు.

Tags:    
Advertisement

Similar News