కమలం గుర్తే మా సీఎం అభ్యర్థి

బెయిల్‌ నిబంధనలు గుర్తు పెట్టుకోవాలని కేజ్రీవాల్‌ కు కౌంటర్‌ ఇచ్చిన బీజేపీ

Advertisement
Update:2025-01-11 20:38 IST

పార్టీ ఎలక్షన్‌ సింబల్‌ కమలం గుర్తే తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ స్పష్టం చేసింది. ఢిల్లీ సీఎం అతిశీని కించపరుస్తూ మాట్లాడిన రమేశ్‌ బిదూరినే బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆప్‌ చీఫ్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించగా.. దానికి బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది. ఎన్నికల్లో గెలవడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీకి సీఎం క్యాండిడేట్‌ కావాలేమో గానీ తమకు అవసరం లేదన్నారు. తమ పార్టీ గుర్తు కమలం సరిపోతుందని బీజేపీ నేత ఆర్పీ సింగ్‌ తేల్చిచెప్పారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో బెయిల్‌ ఇచ్చిన సందర్భంగా కోర్టు పెట్టిన నిబంధనలను కేజ్రీవాల్‌ గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు చెప్పారు. కోర్టు పెట్టిన షరతుల ప్రకారం కేజ్రీవాల్ సీఎంగా ఎలాంటి సంతకాలు చేయరాదని.. ఆఫీస్‌ కు కూడా వెళ్లొద్దన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ లెక్కన కేజ్రీవాల్‌ మళ్లీ సీఎం కాలేరని తేల్చిచెప్పారు. మలినం లేని ప్రభుత్వాన్నే ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News