ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పేసిన కేజ్రీవాల్
ఒకటి, రెండు రోజుల్లోనే ఆ పేరు ప్రకటిస్తారని జోస్యం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చెప్పేశారు. బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరినే సీఎం అభ్యర్థిని కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీలో తనకు సన్నిహితంగా ఉండే ఒక నాయకుడు ఈ విషయం చెప్పారని.. ఒకటి, రెండు రోజుల్లోనే ఆయన పేరు ప్రకటిస్తారని చెప్పారు. రమేశ్ బిదూరికి ఆయన అభినందనలు తెలిపారు. పదేళ్లుగా ఎంపీగా ఉన్న రమేశ్ ఢిల్లీ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పి ఓట్లు అడిగితే మంచిదన్నారు. రమేశ్ బిదూరిని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీజేపీ, ఆప్ సీఎం అభ్యర్థుల మధ్య చర్చ జరగాలని.. ఢిల్లీ ప్రజలకు ఎవరు ఏం చేశారు.. ఏం చేయబోతున్నారనే అంశాలపై ఈ చర్చలో మాట్లాడాలని సూచించారు. ఢిల్లీలో ఓటర్ల నమోదు ప్రక్రియయలో బీజేపీ అనేక అవకతవకలకు పాల్పడుతుందన్నారు.