సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభోత్సవం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న
ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
Advertisement
జమ్మూకశ్మీర్ లోని సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభోత్సవానికి తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఫొటోలను 'ఎక్స్'లో షేర్ చేశారు. దీనిపై ప్రధాని రియాక్ట్ అయ్యారు. టన్నెల్ నిర్మాణం పూర్తవడంపై హర్షం వ్యక్తం చేశారు. రూ.2,700 కోట్లతో జడ్ మోడ్ టన్నెల్ నిర్మించారు. కొండచరియలు విరిగి పడటం, తీవ్రంగా మంచుకురిసి రాకపోకలకు అంతరాయం ఏర్పడే 12 కి.మీ.ల మార్గంలో టన్నెల్ నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే శ్రీనగర్ - సోన్‌మార్గ్ మధ్య రాకపోకలు సులవవుతాయి. సోమవారం ఈనెల టన్నెల్ ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
Advertisement