టీటీడీ శుభవార్త.. రేపట్నుంచి ఆఫ్ లైన్లో టికెట్లు..
భక్త సులభుడిగా పేరున్న తిరుమల శ్రీవారి దర్శనం కూడా కరోనా కారణంగా కష్టమైపోయింది. ఆన్ లైన్లో టికెట్లు దొరకనివారు ఎంత ప్రయత్నించినా తిరుమల వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. ఆన్ లైన్ లో కోటా విడుదల చేసిన ఒకటి రెండు గంటల్లోనే దర్శనం టికెట్లు హాట్ కేకుల్లో అయిపోవడంతో సామాన్య భక్తులు, ఇంటర్నెట్ పరిజ్ఞానం లేనివారు బాగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో దళారీ వ్యవస్థ కూడా కొన్నిచోట్ల మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం […]
భక్త సులభుడిగా పేరున్న తిరుమల శ్రీవారి దర్శనం కూడా కరోనా కారణంగా కష్టమైపోయింది. ఆన్ లైన్లో టికెట్లు దొరకనివారు ఎంత ప్రయత్నించినా తిరుమల వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. ఆన్ లైన్ లో కోటా విడుదల చేసిన ఒకటి రెండు గంటల్లోనే దర్శనం టికెట్లు హాట్ కేకుల్లో అయిపోవడంతో సామాన్య భక్తులు, ఇంటర్నెట్ పరిజ్ఞానం లేనివారు బాగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో దళారీ వ్యవస్థ కూడా కొన్నిచోట్ల మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి దర్శనానికి నేరుగా టికెట్లు ఇచ్చేందుకు టీటీడీ నిర్ణయించింది.
15నుంచి టికెట్లు, 16నుంచి దర్శనం..
ఈనెల 15వతేదీ ఉదయం 9గంటల నుంచి శ్రీవారి దర్శనం టికెట్లు ఆఫ్ లైన్లో అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తారు. గతంలో కాలినడక బాటలో కూడా మధ్యలో కౌంటర్లు పెట్టి దర్శనం టికెట్లు ఇచ్చేవారు కానీ, ప్రస్తుతం ఆ విధానాన్ని ఇంకా పునరుద్ధరించలేదు. కాలినడకన వెళ్లేవారికి కూడా టికెట్ ఉంటేనే పైకి ఎంట్రీ. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే భక్తులకు కూడా దర్శనం టికెట్ ఉంటేనే కొండపైకి వెళ్లేందుకు అనుమతి ఉంది. ఈనెల 16నుంచి ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకున్నవారికి దర్శనానికి అనుమతి ఉంటుంది. దర్శనాల సంఖ్యను కూడా పెంచేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.
కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..
ప్రస్తుతానికి ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్న టీటీడీ.. భక్తులంతా కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది. కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ లేదా, రెండు డోసులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ధృవపత్రం ఉంటేనే భక్తులను కొండపైకి అనుమతిస్తోంది. కరోనా కేసులు తగ్గడం, రవాణా సౌకర్యాలు కూడా మునుపటి స్థితికి చేరుకోవడంతో దర్శనాల సంఖ్యను మరింత పెంచేందుకు టీటీడీ కసరత్తులు చేస్తోంది.