హోదా చుట్టూ రాజకీయం.. మళ్లీ మొదలైన విమర్శల యుద్ధం..

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని త్రిసభ్య కమిటీ అజెండా అంశంలో చేర్చి, ఆ తర్వాత దాన్ని తీసేసిన కేంద్రం మరోసారి హోదా మంటలు రాజేసింది. కేంద్రం చర్యతో హోదా మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలోని అధికార, విపక్షాలు తప్పు మీదంటే మీదేనంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. హోదా సాధించేవరకు పోరాటం.. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘హోదా’ సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం […]

Advertisement
Update:2022-02-13 14:58 IST

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని త్రిసభ్య కమిటీ అజెండా అంశంలో చేర్చి, ఆ తర్వాత దాన్ని తీసేసిన కేంద్రం మరోసారి హోదా మంటలు రాజేసింది. కేంద్రం చర్యతో హోదా మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలోని అధికార, విపక్షాలు తప్పు మీదంటే మీదేనంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

హోదా సాధించేవరకు పోరాటం..
రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘హోదా’ సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం ఉందని.. దీనిపై సీఎం జగన్‌ పలు దఫాలుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. మరోవైపు మూడు రాజధానులపై కూడా రాష్ట్రం చిత్తశుద్ధితో ఉందని, ఎవరెన్ని చెప్పినా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని అన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు మంత్రి బొత్స.

వైసీపీతో కేంద్రం ఒప్పందం..
ప్రత్యేక హోదా అంశాన్ని అజెండాలో పెట్టకపోవడానికి కారణం వైసీపీయేనని విమర్శించారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. వైసీపీతో కేంద్రం చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఆ అంశాన్ని అజెండానుంచి తీసేశారని అన్నారు. అజెండా మారడానికి సీఎం జగన్‌ కేంద్రానికి రాసిన లేఖే కారణమని ఆయన ఆరోపించారు. వైసీపీకి 28 మంది ఎంపీలున్నా కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని.. ప్రత్యేక హోదా అంశంలో ఆ పార్టీది వైఫలమ్యా? లొంగుబాటా? అని విమర్శించారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే తామూ చేస్తామని అన్నారు.

అందుకే అజెండానుంచి తొలగించారు..
ప్రత్యేక హోదాకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని.. అందుకే అజెండా నుంచి దాన్ని తొలగించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విభజన సమస్యలపై, హోదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్రంతో చర్చించవచ్చని తెలిపారు. ఏపీలో రూ.23వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం పనులు చేస్తోందని చెప్పారు వీర్రాజు.

హోదాతో తెలంగాణకు సంబంధం లేదని, త్రిసభ్య కమిటీ మీటింగ్ రెండు రాష్ట్రాలతో జరిగేది కాబట్టి.. అందుకే ఆ అంశాన్ని అజెండాలో చేర్చలేదని బీజేపీ సర్దిచెప్పుకుంటున్నా.. ముందు అజెండాలో ఉంచి, ఆ తర్వాత దాన్ని తొలగించడాన్ని మాత్రం వైసీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. మొత్తమ్మీద మరోసారి ప్రత్యేక హోదా అంశం తైరపైకి రాగా.. ఏపీలోని రాజకీయ పార్టీలు విమర్శల యుద్ధం మొదలు పెట్టాయి.

Tags:    
Advertisement

Similar News