ఏపీలో నైట్ కర్ఫ్యూ.. కొవిడ్ మార్గదర్శకాలు విడుదల..
ఏపీలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈరోజు రాత్రి నుంచే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి. కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. సినిమా థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని 50 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ ఆదేశాలు విడుదలయ్యాయి. […]
ఏపీలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈరోజు రాత్రి నుంచే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి. కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. సినిమా థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని 50 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ ఆదేశాలు విడుదలయ్యాయి.
దేవాలయాలలో భౌతిక దూరం..
రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు మరింత పగడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. మాస్క్ నిబంధన తప్పనిసరి చేయాలన్నారు. 104 కాల్ సెంటర్ ను మరింత సమర్థంగా ఉపయోగించుకునేలా చేయాలన్నారు. ఎవరు కాల్ చేసినా వెంటనే స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానా విధించాలని, బస్సు ప్రయాణాల్లో మాస్క్ తప్పనిసరి చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఫంక్షన్ హాల్స్ లో జరిగే కార్యక్రమాలకు 100మందిని మాత్రమే అనుమతించాలని చెప్పారు.
ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ప్రారంభించిన సీఎం..
రాష్ట్రంలో 50 పడకలు దాటిన 133 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా నిమిషానికి 44వేల లీటర్ల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే 144 పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాటిని జాతికి అంకితం చేసినట్లు వివరించారు.ఇవన్నీ పూర్తైతే 247 చోట్ల ఆక్సిజన్ తయారీకి అవకాశం ఉందని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్ లైన్లు ఉన్నట్లు జగన్ తెలిపారు. 63 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. కొవిడ్ కి ముందు కనీసం ఒక్క వీఆర్ డీఎల్ ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే వీఆర్ డీఎల్ ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్లు జగన్ తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు 82 శాతం మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు సీఎం వివరించారు.