హైదరాబాద్‌లో అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ ప్రారంభం
మిస్సైల్ మ్యాన్, దేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం పేరిట హైదరాబాద్ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిన నగరమైనా.. ఆ రోడ్ల మీద రెండు కిలోమీటర్లు ప్రయాణించాలంటే.. కనీసం అరగంట అయినా కేటాయించాలి. రోడ్లు నిత్యం బిజీగా ఉంటాయి. భాగ్యనగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఓవైసీ జంక్షన్ టు మిధానీ జంక్షన్ వరకు రూ.80 కోట్ల వ్యయంతో 1.365 కిలో మీటర్ల […]
మిస్సైల్ మ్యాన్, దేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం పేరిట హైదరాబాద్ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిన నగరమైనా.. ఆ రోడ్ల మీద రెండు కిలోమీటర్లు ప్రయాణించాలంటే.. కనీసం అరగంట అయినా కేటాయించాలి. రోడ్లు నిత్యం బిజీగా ఉంటాయి. భాగ్యనగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.
ఓవైసీ జంక్షన్ టు మిధానీ జంక్షన్ వరకు రూ.80 కోట్ల వ్యయంతో 1.365 కిలో మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రులు మహబూద్ అలీ, కేటీఆర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు గౌరవిస్తూ ఆయన పేరును ఈ ఫ్లైఓవర్‌కు నామకరణం చేశారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులతో పాటు శ్రీశైలం, బెంగళూరు, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ ఫ్లైఓవర్ అనుకూలంగా ఉంటుంది.