విద్యార్థుల‌కు ఊర‌ట‌.. కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థుల‌ను 35శాతం మార్కులతో పాస్‌ చేస్తున్నట్లు ఆమె వివ‌రించారు. ప‌రీక్ష‌లు త‌ప్పినా పాస్‌ చేయడం ఇదే చివరిసారి.. ఇక ముందు ఇలాంటి నిర్ణయాలు ఉండబోవని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌వ్వ‌గా.. 51 శాతం మంది […]

Advertisement
Update:2021-12-24 14:52 IST

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థుల‌ను 35శాతం మార్కులతో పాస్‌ చేస్తున్నట్లు ఆమె వివ‌రించారు. ప‌రీక్ష‌లు త‌ప్పినా పాస్‌ చేయడం ఇదే చివరిసారి.. ఇక ముందు ఇలాంటి నిర్ణయాలు ఉండబోవని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌వ్వ‌గా.. 51 శాతం మంది ఫెయిల్ అయ్యారు. అయితే, ఫెయిల‌యిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలలో చదివిన విద్యార్థులే ఉన్నారు.

ఫలితాలపై ఇంటర్‌ బోర్డులో ఎలాంటి లోపాలు జరగలేదని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చెప్పారు. వాల్యుయేషన్‌ పకడ్బందీగా జ‌రిగింద‌ని, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్ర‌తిప‌క్షాలు బాధ్యతగా వ్యవహరిస్తే మంచిద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ 35 మార్కులు ఇచ్చి పాస్‌ చేస్తున్నామ‌ని ఆమె చెప్పారు.

విద్యార్థులు కష్టపడి చదివి సెకండ్‌ ఇయర్‌లోనైనా మంచి మార్కులు తెచ్చుకుంటార‌ని భావిస్తున్నామ‌న్నారు. ఫస్టియర్‌ ఫలితాలపై ప్రభుత్వాన్ని, సీఎంను టార్గెట్‌ చేయడం సరికాదని. ప్రతీదీ రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటైపోయిందని మండిప‌డ్డారామె.

Tags:    
Advertisement

Similar News