పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే కొనసాగుతాం.. డీజీపీకి విన్నపం..

గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పనిచేస్తున్న సిబ్బందిని పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవోని హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసు నియామకానికి సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు లేకుండా మహిళా పోలీసుల్ని విధుల్లోకి తీసుకోవడం సరికాదని చెప్పింది. అదే సమయంలో వారిని సచివాలయాల్లోనే కొనసాగించాలని సూచించింది. వారికి పోలీస్ యూనిఫామ్ ఇవ్వాలనే నిర్ణయం కూడా ఈ నేపథ్యంలో ఆగిపోయింది. అయితే మహిళా సంరక్షణ కార్యదర్శులు మాత్రం తమను పోలీస్ డిపార్ట్ మెంట్ […]

Advertisement
Update:2021-12-14 04:31 IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పనిచేస్తున్న సిబ్బందిని పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవోని హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసు నియామకానికి సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు లేకుండా మహిళా పోలీసుల్ని విధుల్లోకి తీసుకోవడం సరికాదని చెప్పింది. అదే సమయంలో వారిని సచివాలయాల్లోనే కొనసాగించాలని సూచించింది. వారికి పోలీస్ యూనిఫామ్ ఇవ్వాలనే నిర్ణయం కూడా ఈ నేపథ్యంలో ఆగిపోయింది.

అయితే మహిళా సంరక్షణ కార్యదర్శులు మాత్రం తమను పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల హోం మంత్రి మేకతోటి సుచరితకు ఇదే విషయమై వారు వినతిపత్రం అందించారు. తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కలసి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 15వేలమంది మహిళా సంరక్షణ కార్యదర్శులుగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారని, వారందరినీ పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి తీసుకోవాలని కోరారు ప్రతినిధులు. మహిళా పోలీసులుగా తమ విధులను సక్రమంగా నిర్వహిస్తామని, శాంతిభద్రతల స్థాపనకు తమవంతు కృషిచేస్తామని డీజీపీకి చెప్పారు. కొంతమంది ఈ విలీనానికి ఉద్దేశపూర్వకంగానే అడ్డు తగులుతున్నారని, కోర్టు కేసులతో ఆటంకం కలిగిస్తున్నారని చెప్పారు. 15వేలమంది ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు న్యాయం చేయాలని డీజీపీని కోరారు.

డీజీపీ అభయం..
హైకోర్టు ఈ జీవోని కొట్టివేసినా.. త్వరలో పగడ్బందీగా మరో కొత్త జీవో ద్వారా మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోందని వారికి హామీ ఇచ్చారు డీజీపీ గౌతమ్ సవాంగ్. కొత్త జీవో ద్వారా వారి కోరిక నెరవేరుతుందని భరోసా ఇచ్చారు. సచివాలయాల్లో విధులు సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని వారికి సూచించారు.

Tags:    
Advertisement

Similar News