నెగెటివ్ క్యాలరీల గురించి తెలుసా? తింటూనే బరువు తగ్గే ఫార్ములా !

Health Tips: బరువు తగ్గాలంటే కడుపు మార్చుకోవాలనుకుంటారు చాలామంది. కానీ అలా చేయాల్సిన అవసరమే లేదు. బరువు అదుపులో ఉంచుకుంటూ తగిన విధంగా డైట్‌ను ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం నెగెటివ్ క్యాలరీ ఫుడ్స్ ను ఎంచుకోవచ్చు.

Advertisement
Update:2023-01-09 16:15 IST

బరువు తగ్గాలంటే కడుపు మార్చుకోవాలనుకుంటారు చాలామంది. కానీ అలా చేయాల్సిన అవసరమే లేదు. బరువు అదుపులో ఉంచుకుంటూ తగిన విధంగా డైట్‌ను ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం నెగెటివ్ క్యాలరీ ఫుడ్స్ ను ఎంచుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
నెగెటివ్ కేలరీలు అంటే..

సాధారణంగా ఏదైనా ఫుడ్ తింటే అది​ జీర్ణం అయ్యి, దాన్నుంచి క్యాలరీల రూపంలో మనకు ఎనర్జీ వస్తుంది. అయితే నెగెటివ్​ క్యాలరీ ఫుడ్స్ విషయంలో ఇది వేరేలా జరుగుతుంది. ఈ నెగెటివ్ క్యాలరీ ఫుడ్స్ ఇచ్చే క్యాలరీల కన్నా వీటని అరిగించడం కోసం శరీరం ఖర్చు చేసే క్యాలరీలే ఎక్కువ. అంటే ఇవి తినడం ద్వారా తక్కువ క్యాలరీలు అందుతూ.. ఎక్కువ క్యాలరీలు కరుగుతాయన్నమాట. ఈ నెగెటివ్​ క్యాలరీల లిస్ట్‌లో ఉండే ఫుడ్స్​ ఏవంటే..

బెర్రీస్​: బెర్రీస్ లో ఉండే హై ప్రొటీన్ వల్ల బెర్రీలను నెగెటివ్​ క్యాలరీ ఫుడ్​ అంటారు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్​ ఎక్కువ. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాపాడతాయి. అరకప్పు బెర్రీస్​లో కేవలం 32 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.

టొమాటో: వంద గ్రాముల టొమాటోలో 19 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్​–సి ఎక్కువ. అందుకే వీటిని డైట్​​లో చేర్చితే బరువు తగ్గడం సులభం.

దోసకాయ : వంద గ్రాముల దోసకాయలో 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువ. శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, మినరల్స్​ అందిస్తుంది. అలాగే డైటరీ ఫైబర్‌ను అందిస్తుంది.

పుచ్చకాయ: వంద గ్రాముల పుచ్చకాయలో 30 క్యాలరీలు ఉంటాయి. పుచ్చకాయ గింజలు రక్తహీనతను నివారిస్తాయి. ఇందులోని సి, బి6 విటమిన్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. .

క్యారెట్స్ : వంద గ్రాముల క్యారెట్స్ లో 41 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో ఉండే పీచుపదార్థాలు, విటమిన్లు ఎక్కువ. క్యారెట్స్ తింటే ఆకలి వేయదు. తద్వారా ఈజీగా బరువు తగ్గొచ్చు..

యాపిల్ : యాపిల్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాపిల్స్ తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. వంద గ్రాముల యాపిల్ లో కేవలం 50 గ్రాముల క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అందుకే బరువు తగ్గడానికి యాపిల్స్ బెస్ట్ ఆప్షన్.

బ్రోకొలీ: వంద గ్రాముల బ్రోకొలీలో 34 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కొవ్వు కరగడానికి ఇవి తోడ్పడతాయి.

Tags:    
Advertisement

Similar News