కోడ్ రాకముందే లక్ష కోట్లు గుమ్మరించేందుకు రంగం సిద్ధం..

ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా లక్ష కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. యూపీలో పార్టీ పరిస్థితి కాస్త అటు ఇటుగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఫోకస్ అంతా అక్కడే పెట్టింది. లక్షకోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల్ని యూపీకి కేటాయించారు ప్రధాని నరేంద్రమోదీ. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఓ నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి అన్నట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వ పరిస్థితి. అందులోనూ […]

Advertisement
Update:2021-11-10 09:46 IST

ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా లక్ష కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. యూపీలో పార్టీ పరిస్థితి కాస్త అటు ఇటుగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఫోకస్ అంతా అక్కడే పెట్టింది. లక్షకోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల్ని యూపీకి కేటాయించారు ప్రధాని నరేంద్రమోదీ.

బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఓ నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి అన్నట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వ పరిస్థితి. అందులోనూ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో యూపీలో లక్ష కోట్లు కుమ్మరించేందుకు రంగం సిద్ధం చేసింది. నెలలో ఏకంగా నాలుగు సార్లు ప్రధాని మోదీ పర్యటన ఖరారు కావడం మరో విశేషం.
నవంబర్ 16న గోరఖ్ పూరర్- పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్సవం. ఈ ప్రాజెక్ట్ ఖర్చు 42వేల కోట్ల రూపాయలు.

– నవంబర్ 19న రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ 193వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ ఝాన్సీకి వస్తారు. భారత్ డైనమిక్స్ సంస్థకు చెందిన నూతన ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
– నవంబర్ 20న డీజీపీల వార్షిక సమావేశంలో పాల్గొనడానికి లక్నోకి వస్తారు మోదీ.
– నవంబర్ 25న నోయిడా సమీపంలో జేవార్ ఎయిర్ పోర్ట్ కి ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది.
– ఇక డిసెంబర్లో తన సొంత నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథ టెంపుల్ కారిడార్ ప్రారంభోత్సవానికి మోదీ మరోసారి యూపీకి వస్తారు.

యూపీ ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఆ రాష్ట్రంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు ప్రధాని మోదీ. అధికారిక కార్యక్రమాలు, పనిలో పనిగా పార్టీ తరపున ప్రచారం. ఇలా సాగుతాయి మోదీ యాత్రలు. వచ్చే ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అభివృద్ధి పనుల పేరుతో నిధుల వరద పారించడానికి కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మొత్తం ఈ ఏడాది లక్ష కోట్ల నూతన ప్రాజెక్ట్ లు యూపీలో మొదలు కాబోతున్నాయి. వీటన్నిటినీ బీజేపీ ఘనతగా చెప్పుకుంటూ మరోసారి అక్కడ యోగీని గద్దనెక్కించేందుకు పాట్లు పడుతున్నారు ఆ పార్టీ పెద్దలు.

Tags:    
Advertisement

Similar News