టీ20 వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్.. సెమీస్ కు న్యూజిలాండ్..!

టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ జరిగిన టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే టీమ్ ఇండియా సెమీస్ కు చేరే అవకాశాలు ఉంటాయని అంతా ఆశలు పెట్టుకోగా.. అవి ఆవిరయ్యాయి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన పోరులో న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి నేరుగా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో […]

Advertisement
Update:2021-11-07 14:59 IST

టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ జరిగిన టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే టీమ్ ఇండియా సెమీస్ కు చేరే అవకాశాలు ఉంటాయని అంతా ఆశలు పెట్టుకోగా.. అవి ఆవిరయ్యాయి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన పోరులో న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి నేరుగా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా కథ ముగిసింది.

ఇవాళ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని కోట్లాది మంది భారతీయులు కోరుకున్నారు. మ్యాచ్ జరుగుతున్న స్టేడియం వద్ద కూడా భారత అభిమానులు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మద్దతు తెలిపారు. కాగా కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించడంతో ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు.

గ్రూప్ – 2 నుంచి ఇప్పటికే పాకిస్తాన్ సెమీస్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే రన్ రేట్ ఆధారంగా భారత్ సెమీస్ వెళ్లే అవకాశాలు ఉండేవి. ఆ ఆశలపై న్యూజిలాండ్ నీళ్లు చల్లింది. సెమీస్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ తప్పక గెలవాల్సి ఉంది. ఆ జట్టు అన్ని విభాగాల్లో రాణించి ఆఫ్ఘనిస్తాన్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 124 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 18.1 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. కాగా భారత జట్టు వరల్డ్ కప్ లో భాగంగా ఇంకా నమీబియా జట్టుతో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ సెమీస్ కు చేరడంతో ఈ మ్యాచ్ ఇక నామ మాత్రంగా మారనుంది.

Tags:    
Advertisement

Similar News