ఏటీఎంల భారం దించుకుంటున్న బ్యాంక్ లు..

ఏటీఎంల నిర్వహణ భారాన్ని బ్యాంకులు పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కరోనా కష్టకాలంలో డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంలకు కాస్త విశ్రాంతి దొరికింది. అదే సమయంలో ఏటీఎంల నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు బ్యాంకులు ప్రణాళికలు అమలులో పెట్టాయి. రాబోయే రోజుల్లో 80 నుంచి 85శాతానికి పైగా ఏటీఎంలను థర్డ్ పార్టీలకు అప్పగించేయబోతున్నాయి. ఏటీఎం లావాదేవీలపై చార్జీలు పెచండం ద్వారా మరికొంత మేర నిర్వహణ ఖర్చు తగ్గించుకోబోతున్నాయి. భారత్ లోనే అత్యల్పం.. ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది వయోజనులున్న […]

Advertisement
Update:2021-11-06 13:14 IST

ఏటీఎంల నిర్వహణ భారాన్ని బ్యాంకులు పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కరోనా కష్టకాలంలో డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంలకు కాస్త విశ్రాంతి దొరికింది. అదే సమయంలో ఏటీఎంల నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు బ్యాంకులు ప్రణాళికలు అమలులో పెట్టాయి. రాబోయే రోజుల్లో 80 నుంచి 85శాతానికి పైగా ఏటీఎంలను థర్డ్ పార్టీలకు అప్పగించేయబోతున్నాయి. ఏటీఎం లావాదేవీలపై చార్జీలు పెచండం ద్వారా మరికొంత మేర నిర్వహణ ఖర్చు తగ్గించుకోబోతున్నాయి.

భారత్ లోనే అత్యల్పం..
ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది వయోజనులున్న ప్రాంతంలో సగటున 47 ఏటీఎంలు ఉండగా.. భారత్ లో వాటి సంఖ్య కేవలం 22మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష జనాభాకు కేవలం 15 ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఏటీఎంల నిర్వహణను భారంగా భావిస్తున్న బ్యాంకులు వాటిని తగ్గించుకునే ప్రయత్నం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో బ్రౌన్ లేబుల్ ఏటీఎంల పేరుతో.. థర్డ్ పార్టీలకు వాటి నిర్వహణ బాధ్యతల్ని అప్పగించేస్తున్నాయి.

కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో.. వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో నగదు లావాదేవీల సంఖ్య కూడా పెరిగింది. గతంలో ఏటీఎంల నిర్వహణ పట్టించుకోకపోయినా ఇప్పుడు బ్యాంక్ లకు ఏటీఎంలలో నగదు నింపడం తప్పనిసరిగా మారింది. నో క్యాష్ ఏటీఎంలపై భారీగా బ్యాంక్ లకు ఫిర్యాదులందుతున్నాయి. మరోవైపు ఏటీఎంల సంఖ్య పెంచడం కూడా అనివార్యం అవుతోంది. అయితే ఇప్పటికే ఉన్న ఏటీఎంలను, కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్నవాటిని పూర్తిగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నిర్వహించేందుకు బ్యాంక్ యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి. 2020లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10వేల ఏటీఎంలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నిర్వహించేందుకు దరఖాస్తులు కోరింది. ఈ ఏడాదినుంచి ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ లు.. 20వేల బ్రౌన్ లేబుల్ ఏటీఎంలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో బ్యాంక్ ఏటీఎం సేవలన్నీ థర్డ్ పార్టీలకే అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News