టపాకాయల తయారీదారులకు సుప్రీంలో ఊరట..

టపాకాయలు కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, శ్వాస కోశ సమస్యలు వచ్చే అవకాశముంది.. అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతున్నదే. ప్రతి ఏడాదీ దీపావళికి ముందు దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది, ఆ తర్వాత సద్దుమణుగుతుంది. గతేడాది కరోనా వల్ల దీపావళి వెలుగులు పెద్దగా కనిపించలేదు. ఈ ఏడాది మాత్రం నిబంధనలు సడలించడంతో పండగ ధూమ్ ధామ్ గా చేయాలని అందరూ సిద్ధమయ్యారు. అయితే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లు, […]

Advertisement
Update:2021-11-02 03:31 IST

టపాకాయలు కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, శ్వాస కోశ సమస్యలు వచ్చే అవకాశముంది.. అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతున్నదే. ప్రతి ఏడాదీ దీపావళికి ముందు దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది, ఆ తర్వాత సద్దుమణుగుతుంది. గతేడాది కరోనా వల్ల దీపావళి వెలుగులు పెద్దగా కనిపించలేదు. ఈ ఏడాది మాత్రం నిబంధనలు సడలించడంతో పండగ ధూమ్ ధామ్ గా చేయాలని అందరూ సిద్ధమయ్యారు. అయితే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లు, నిల్వ, వినియోగంపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించడంతో మళ్లీ చర్చ మొదలైంది.

టపాకాయలకు కేరాఫ్ అడ్రస్ అయిన శివకాశి తరపున తమిళనాడు సీఎం స్టాలిన్.. నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన లేఖలు రాశారు. టపాకాయలపై నిషేధం విధించొద్దని, లక్షలమంది కార్మికుల జీవితాలు వాటిపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. కానీ రోజులు గడుస్తున్నా ఏ రాష్ట్రం కూడా కనికరించలేదు. గ్రీన్ క్రాకర్స్ కి మాత్రమే అనుమతిస్తామని అది కూడా రాత్రిపూట 2 గంటలు మాత్రమే కాల్చుకోవాలని అధికారికంగా ఆదేశాలు కూడా ఇచ్చేశాయి. దీంతో టపాకాయల తయారీదారులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. పశ్చిమబెంగాల్ లో పూర్తిగా నిషేధం విధించడంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నిషేధం సరైనదే.. కానీ..!
టపాకాయలపై బ్లాంకెట్ బ్యాన్ సరికాదని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీపావళి సందర్భంగా వాతావరణ కాలుష్యం పెరిగిపోకుండా నివారించడం సరైన చర్యే అయినా.. అదే సమయంలో అన్నిటిపై గుడ్డిగా నిషేధం విధించడం సరికాదని చెప్పింది. టపాకాయల తయారీలో హానికర రసాయనాల వినియోగంతగ్గించడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని, అంతేకాని.. వాటిపై పూర్తిగా నిషేధం విధించడంతో సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేసింది. మనుషులకు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే వాటిపై మాత్రం నిషేధం కొనసాగించాలని చెప్పింది. దీంతో టపాకాయల తయారీదారులకు కాస్త ఊరట లభించినట్లయింది.

Tags:    
Advertisement

Similar News