తెల్లచీరలు మాకొద్దు.. ఏపీ ప్రభుత్వ మహిళా వైద్యుల నిరసన..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు ఇకపై డ్రెస్ కోడ్ పాటించాలంటూ ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం మహిళా డాక్టర్లు పొడుకు చేతుల వైట్ ఆప్రాన్ తో పాటు ఐడీకార్డ్ మెడలో ధరించాలి. తెల్ల చీర, లేదా వైట్ అంట్ వైట్ చుడీదార్ వేసుకోవాలి. స్టాఫ్ నర్స్ లు, ఇతర సిబ్బంది పొట్టి చేతుల ఆప్రాన్, తెల్లచీర కట్టుకోవాలి, ఐడీకార్డ్ ధరించాలి. మగ డాక్టర్లు కూడా పొడుగు చేతుల ఆప్రాన్ ధరించాలి […]

Advertisement
Update:2021-10-31 12:13 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు ఇకపై డ్రెస్ కోడ్ పాటించాలంటూ ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం మహిళా డాక్టర్లు పొడుకు చేతుల వైట్ ఆప్రాన్ తో పాటు ఐడీకార్డ్ మెడలో ధరించాలి. తెల్ల చీర, లేదా వైట్ అంట్ వైట్ చుడీదార్ వేసుకోవాలి. స్టాఫ్ నర్స్ లు, ఇతర సిబ్బంది పొట్టి చేతుల ఆప్రాన్, తెల్లచీర కట్టుకోవాలి, ఐడీకార్డ్ ధరించాలి. మగ డాక్టర్లు కూడా పొడుగు చేతుల ఆప్రాన్ ధరించాలి కానీ.. వారికి డ్రస్ కలర్ విషయంలో మినహాయింపునిచ్చారు. సరిగ్గా ఇదే విషయంపై మహిళా వైద్యులు ఉన్నతాధికారుల తీరుని నిరసిస్తున్నారు. మగవారికి లేని డ్రెస్ కోడ్, ఆడవారికి ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

వైట్ డ్రస్ మాకొద్దు..
ఆప్రాన్, ఐడీకార్డ్ వరకు ఓకే కానీ, డ్రెస్ కోడ్ తో తాము ఇబ్బందులు ఎదుర్కొంటామని చెబుతున్నారు మహిళా వైద్యులు. ఇప్పటికే ఏపీలో పలువిభాగాల మహిళలు తెల్ల చీరలు ధరిస్తుంటారని, ఆశా వర్కర్లు, స్టాఫ్ నర్స్ లు.. కూడా తెల్ల చీరలు కట్టుకుంటారని, తమను కూడా వారిలో కలిపేయడం సరికాదని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి వినతిపత్రం అందించేందుకు సిద్ధమయ్యారు. కొత్తగా తీసుకొచ్చిన డ్రెస్ కోడ్ ని ప్రభుత్వ మహిళా వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

డ్రెస్ కోడ్ తో ఇబ్బందేముంది..!
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన డ్రెస్ కోడ్ తో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు ఆరోగ్య విభాగం సంచాలకులు డాక్టర్ టి.గీతా ప్రసాదిని. ప్రభుత్వ వైద్యులకు కూడా యూనిఫామ్ ఉండాలనే ఉద్దేశంతోటే ఈ నియమ నిబంధనలు తీసుకొచ్చామని, దీనిపై అభ్యంతరాలుంటే కచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు. వైద్య విభాగంలో ఉద్యోగుల హోదా ప్రకారం డ్రెస్ కోడ్ ఇచ్చామని ఆమె చెప్పారు.

Tags:    
Advertisement

Similar News