జాతకాలు చూసే విక్రమాదిత్య
చాలా సంవత్సరాల తర్వాత రెబల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా “రాధేశ్యామ్”. ఈ సినిమా లో ప్రభాస్ విక్రమాదిత్య గా ఎలా వుండబోతున్నాడు..? ఏం చేయబోతున్నాడు?. విక్రమాదిత్య ఎవరు..? అనే ప్రశ్నలకి సమాధానంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. ఇందులో రెబల్‌స్టార్ ప్రభాస్ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా, జ్యోతిష్కుడి పాత్రలో కనిపించనున్నాడు. ”నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు, కానీ […]
చాలా సంవత్సరాల తర్వాత రెబల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా “రాధేశ్యామ్”. ఈ
సినిమా లో ప్రభాస్ విక్రమాదిత్య గా ఎలా వుండబోతున్నాడు..? ఏం చేయబోతున్నాడు?. విక్రమాదిత్య ఎవరు..? అనే ప్రశ్నలకి సమాధానంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. ఇందులో రెబల్‌స్టార్ ప్రభాస్ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా, జ్యోతిష్కుడి పాత్రలో కనిపించనున్నాడు.
”నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు దగ్గరి నుంచి నాకు అన్నీ తెలుసు కానీ నీకు ఏది చెప్పను, ఎందుకంటే అది చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడిని కాదు కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు” అంటూ ప్రభాస్ చెప్పే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది.
దర్శకుడు రాధాకృష్ణ, ప్రభాస్ ను సరికొత్త గా ప్రెజెంట్ చేశాడు. దీనికి జస్టిన్ ప్రభాకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ గా పుజా హెగ్డే కనిపించనున్నారు. సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్నాడు విక్రమాదిత్య.